VZM: డెంకాడ మండలంలోని పినతాడివాడ రామాలయంలో వైసీపీ నేతలు, స్థానిక యువత శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ లెంక లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిపించారు. వారు మాట్లాడుతూ.. రాజకీయ దుర్బుద్ధితో తిరుమల లడ్డు పవిత్రతను అపవిత్రం చేశారన్నారు. చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని, రాష్ట్రం బాగుండాలని పూజలు నిర్వహించామన్నారు.