ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఓటరు జాబితా అంశం సంచలనం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున ఓట్లు తీసేయడం….. కొత్త ఓట్లు చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అయితే టిడిపి(TDP) ఓట్లు తొలగించి..కొత్తగా వైసీపీ దొంగ ఓట్లు సృష్టిస్తుందనేది టిడిపి చేస్తున్న ఆరోపణ.రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వివిధ జిల్లాల్లో కలెక్టర్ (Collector) కార్యాలయాలతో పాటుగా నుంచి స్థానిక అధికారులకు కూడా పార్టీలు, సంఘాలు, వ్యక్తుల నుంచి కంప్లెంట్లు అందాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ మరి కొన్ని చోట్ల అక్రమ ఓట్లు భారీ స్థాయిలో బయటపడ్డాయి.
విజయవాడలో ఒక ఇంటికి డోర్ నెంబర్ లేదు. కానీ, 650 ఓట్లు మాత్రం ఉన్నాయి. కర్నూలు జిల్లా (Kurnool District) ఆదోని పట్టణంలో ఒకే ఇంట్లో 706 ఓట్లున్నాయి. మచిలీపట్నంకు సంబంధించి పట్టణ ఓటర్లు రూరల్‌కి, రూరల్ ఓటర్లు మచిలీపట్నం పట్టణానికి మారిపోయాయి.ఏపీలో అక్రమ ఓట్ల గురించి ఫిర్యాదులు రావడం ఇదేం కొత్త కాదు. గతంలో తెలుగుదేశం పార్టీలో హయాంలో కూడా ఇదే తరహా ఆరోపణలొచ్చాయి. తమకు అనుకూలంగా లేని వారి ఓట్లను జాబితా నుంచి తొలగించారని, లేని ఓట్లను సృష్టించుకున్నారని టీడీపీపై వైసీపీ అప్పట్లో విమర్శలు చేసింది. ఇప్పుడు అదే పని వైసీపీ (YCP) చేస్తోందని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. కొందరు ఓటర్లు మరణించినప్పటికీ వారి పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో కనిపిస్తున్నాయి.
పదేళ్ల క్రితం మరణించిన వారి పేర్లు కూడా ఓటర్ల లిస్టులో ఉన్నాయి. ఓటర్ల లిస్టులో పేరు ఉన్న వాళ్లలో కొందరు స్థానికేతరులు ఉన్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంటి నెంబర్ మీద 500 ఓట్లు, ఇంకొన్ని చోట్ల 600 ఓట్లు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. విజయవాడ(Vijayawada), గుంటూరుతోపాటు చాలా చోట్ల అక్రమ ఓట్లు బయటపడ్డాయి. 2,100 చోట్ల 50కి పైగా ఓట్లు నమోదయ్యాయి. ఇవన్నీ అక్రమాలే అంటే స్థానికులు, పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission)కూడా దృష్టిపెట్టింది. రాష్ట్ర ఈసీ అధికారులను పిలిపించి మాట్లాడింది. దీంతో తర్వాత ప్రకటించబోయే ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చేస్తామని సీఈసీ (CEC)కి రాష్ట్ర అధికారులు వెలం. రాబోయే జాబితాలో తప్పులు లేకుండా చూస్తామని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు.