Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాక్..రూ.1.64 లక్షల కోట్లు నష్టం
ఎలాన్ మస్క్‌కు మరోసారి గట్టి దెబ్బ తగిలింది. ఒక్కరోజే ఆయన కంపెనీ టెస్లా భారీగా నష్టపోయింది. అయినప్పటికీ ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ మొదటి స్థానంలోనే కొనసాగతుండటం విశేషం.
ఎలాన్ మస్క్(Elon Musk)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ట్విట్టర్(Twitter), టెస్లా(Tesla) సంస్థల అధినేత అయిన ఎలాన్ మస్క్ భారీగా నష్టపోయారు. టెస్లా షేర్లు(Tesla shares tumble) భారీగా పతనం అయ్యాయి. ఒక్క రోజే ఏకంగా 20.3 బిలియన్ డాలర్ల సంపదను మస్క్ కోల్పోయారు. భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1.64 లక్షల కోట్లను ఎలాన్ మస్క్ కోల్పోయినా ప్రపంచ కుబేరుల జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని మాత్రం కోల్పోలేదు.
భారీ సంపద నష్టపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించనున్నట్లు టెస్లా సంస్థ ప్రకటించింది. గురువారం నాటికి అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్‌లో టెస్లా(Tesla) కంపెనీ షేర్ల ధరలు భారీగా పతనం అయ్యాయి. షేరు ధర ఏకంగా 9.7 శాతం తగ్గింది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారంగా ఎలాన్ మస్క్(Elon Musk) నికర సంపద 234.4 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది.
ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ స్థాపించిన ఎల్వీఎంహెచ్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీంతో మస్క్ మళ్లీ బెర్నార్డ్‌ను దాటుకుని ప్రపంచ కుబేరుడి జాబితాలోకి చేరాడు. టెస్లా షేర్లు నష్టపోవడంతో వారిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. అయితే భారీగా సంపద నష్టపోయినా కూడా మస్క్(Elon Musk) మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు. బెర్నార్డ్ కంటే మస్క్ సంపద 33 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉండటం విశేషం.
ట్రేడింగ్‌లో గురువారం అమెరికాకు చెందిన నాస్ డాక్ కంపెనీ 2.3 శాతం తగ్గింది. దీంతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌తో సహా ఒరాకిల్ అధినేత లారీ ఎల్లిసన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్, మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్, ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌ల నికర సంపద భారీగా తగ్గింది. వీరంతా ఒక్కరోజే 20.8 బిలియన్ డాలర్లను కోల్పోయారు.