Sensex: 800 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..భారీ నష్టాలు
ఇండియన్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం(జులై 21) భారీ నష్టాలతో దిగువకు దూసుకెళ్తున్నాయి. ఒకానొకదశలో సెన్సెక్స్ 800 పాయింట్లకుపైగా కోల్పోయింది. దీంతోపాటు నిఫ్టీ కూడా 200 పాయింట్లు నష్టపోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో(జులై 21న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఒక దశలో BSE సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లు పడిపోయి 66,800 స్థాయిల వద్ద కోట్ చేయగా, ఇక నిఫ్టీ 200 పాయింట్లు దిగజారి 19, 700 మార్కుకు పడిపోయింది. ఇన్ఫోసిస్ Q1FY24 బలహీన ఫలితాలు శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. గత త్రైమాసికంలో మార్గనిర్దేశం చేసిన 4-7 శాతం నుంచి స్థిరమైన కరెన్సీలో IT బెల్వెథర్ దాని FY24 ఔట్‌లుక్‌ను 1-3.5 శాతానికి తగ్గించిన తర్వాత ఇన్ఫోసిస్ షేర్లు 8 శాతం పడిపోయాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా పాజిటివ్‌లో దూసుకెళ్లిన సూచీలు ఈరోజు దిగువకు పయనిస్తున్నాయి.
దీంతోపాటు హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ ఎం, టీసీఎస్, హెచ్‌యుఎల్(HUL), అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.6 శాతం వరకు క్షీణించాయి. ఎల్‌అండ్‌టి, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ 2.6 సూచీలకు కొంత మద్దతునిచ్చాయి. విస్తృత మార్కెట్లో బిఎస్ఇ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.3 శాతం, 0.07 శాతం పడిపోయాయి. నిఫ్టీ ఐటి ఇండెక్స్ 4.5 శాతం క్రాష్ అయ్యింది. నిఫ్టీ ఫార్మా, ఎఫ్ఎంసిజి ఇండెక్స్‌లు (ఒక్కోటి చొప్పున 0.3 శాతం తగ్గాయి).