తిరుమల (Tirumala) క్షేత్రంలో తరచూ ప్రమాదాలు (Accidents) చోటుచేసుకుంటున్నాయి. వారం వ్యవధిలో రెండో సంఘటన చోటుచేసుకుంది. ఘాట్ మార్గంలో (Ghat Way) మూలమలుపు వద్ద టెంపో వాహనం (Tempo) బోల్తా పడింది. గోడను తగిలి ఆగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కాగా, వాహనంలోని 13 మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదైంది.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి వెళ్లేందుకు సోమవారం మధ్యాహ్నం టెంపో వాహనం కిందకు వస్తోంది. మొదటి ఘాట్ రోడ్డులో కిందకు దిగుతుండగా ఆరో మలుపు (6th Turn Point) వద్ద వాహనం ఉన్న రక్షణ గోడను (Safety Wall) ఢీకొట్టింది. గోడను ఆనుకోవడంతో వాహనం లోయలోకి పడకుండా ఆగిపోయింది. వెంటనే భద్రతా సిబ్బంది (Security Force) అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో రుయా ఆస్పత్రికి తరలించాారు.
ప్రమాదంపై ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెరుగైన చికిత్స అందించాలని తితిదే ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy), జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. కాగా, వారంలో ఇది రెండో సంఘటన. తరచుగా ఘాట్ రోడ్డులలో ప్రమాదాలు చోటుచసుకుంది. దీనిపై విచారణ జరిపి నివేదిక అందించాలని ఈవో ధర్మారెడ్డి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.