»Tdp Jsp Agree To Give Six Lok Sabha 10 Assembly Seats For Bjp In Andhra Poll
BJP : ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలివే
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుంది? ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తుందన్న విషయాలు దాదాపుగా ఖరారు అయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
BJP in Andhra poll : వచ్చే 2024 అసెంబ్లీ(Assembly) ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ పది స్థానాల్లో పోటీ చేస్తోంది. విశాఖ నార్త్, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్దేవలు, జమ్మల మడుగు, ధర్మవరం, ఆదోని నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించారు. దీంతో ఈ స్థానాల్లో బీజేపీ(BJP) పోటీ చేయనుంది. అభ్యర్థులు ఎవరనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఎన్నికల( poll ) ముందు ఒకటి, రెండు స్థానాల్లో ఏమైనా మార్పులు జరిగితే జరగవచ్చు. విశాఖ నార్త్ నుంచి సీనియర్ నేత విష్ణు కుమార్ రాజుతో పాటు మరొకరి పేరు వినిపిస్తోంది. కైకలూరు నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, జమ్మల మడుగు నుంచి మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి, బద్దేలు నుంచి సురేష్, ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, ఆదోని నుంచి కర్నూలు జిల్లాల భాజపా అధ్యక్షుడు కొనిగిరి నీలకంఠం, శ్రీకాకుళం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. సరేంద్ర మోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరు పోటీ చేయనున్నారన్న విషయం ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ, ఆరు లోక్ సభ సీట్లలో పోటీ చేస్తోంది. అలాగే తెలుగు దేశం పార్టీ 17 లోక్ సభ సీట్లలో 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇంకా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జన సేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తోంది.