surekha vani : భర్తను గుర్తు తెచ్చుకుని కన్నీరు పెట్టుకుని సురేఖ వాణి
తన భర్త ఒకసారి కనిపిస్తే తాను చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయని అంటూ నటి సురేఖ వాణి కన్నీరు పెట్టుకున్నారు. ఆయన బతికున్నప్పుడు కొన్ని చెప్పుకోలేకపోయానన్నారు.
Surekha Vani Emotional Words : నటి సురేఖ వాణి ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన భర్తను గుర్తు తెచ్చుకుని కన్నీరు పెట్టుకున్నారు. తన భర్త సురేష్ తేజ బతికి వస్తే ఆయనతో కొన్ని చెప్పుకోవలసినవి ఉన్నాయన్నారు. ఆయన బతికి ఉన్నప్పుడు కొన్ని విషయాలను ఆయనతో పంచుకోలేకపోయానని అన్నారు. అందుకనే చనిపోయిన ఆత్మలతో సంభాషించడం లాంటి రీల్స్ వస్తున్నప్పుడు తాను వాటిని ఆసక్తిగా చూస్తానని అన్నారు.
చనిపోయిన తన భర్తతో మళ్లీ మాట్లాడే అవకాశం వస్తుందని అనుకోవడం లేదని సురేఖ వాణి (Surekha Vani)అన్నారు. ఈ జన్మకు నేను పంచుకోవాల్సిన కొన్ని విషయాలు అలాగే ఉండిపోయాయని బాధ పడ్డారు. అయితే తన భర్త ఇప్పటికీ తనతో ఉన్నారని తాను నమ్ముతానని అన్నారు. ఆయన స్థానాన్ని ఇంకెవరికీ ఇవ్వదలుచుకోలేదని చెప్పారు. తాను రెండో పెళ్లి చేసుకుంటానని వస్తున్న కామెంట్స్‌కూ ఫుల్ స్టాప్ పెట్టారు. తనకు అలాంటి ఉద్దేశాలు లేవన్నారు.
సోషల్ మీడియాలో సురేఖ వాణి, ఆమె కూతురుపై ఎక్కువగా ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ఆ విషయాలను తాను అసలు పట్టించుకోనని అన్నారు. మొదట్లో వాటిని చూసి బాధగా ఉండేది కానీ ఇప్పుడు అసలు కామెంట్స్ చదవడం లేదని అన్నారు. తన కూతురు సుప్రితకూ అదే చెబుతానని అన్నారు. ఎవరి కామెంట్స్‌నీ లెక్క చేయవద్దని చెబుతానని అన్నారు. నాలుగేళ్ల క్రితం సురేఖ వాణి భర్త సీరియల్లకు దర్శకత్వం వహించిన సురేష్ తేజ అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే.