»Supritha Said If You Wish To Revanth Will You Troll So Much
Supritha: రేవంత్ కు విష్ చేస్తే అంతలా ట్రోల్ చేస్తారా?
టాలీవుడ్ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీయ ఇటివల సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించారు. ఎన్నికల్లో గెల్చిన వ్యక్తికి విషెస్ చెప్పినంత మాత్రనా అంతలా టార్గెట్ చేస్తారా అంటూ ప్రశ్నించింది. అంతేకాదు తనలాగే అనేక మంది బీఆర్ఎస్ పార్టీ తరఫున రీల్స్ చేసినట్లు గుర్తు చేసింది.
Supritha said If you wish to Revanth will you troll so much
టాలీవుడ్ సీనియర్ నటి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి(surekha vani) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవల సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే సురేఖా వాణి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా తన కూతురితో రీల్స్ చేయించి డబ్బులు ఇస్తే రెండో పెళ్లి కూడా చేసుకుంటానని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పడం ఎంత వైరల్ అయింది. అయితే ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో తన అందాల ఫోటో షూట్ చిత్రాలతో హల్ చల్ చేస్తోంది.
ఈ క్రమంలోనే ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేసేందుకు పలువురు సెలబ్రిటీలు రీల్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో సురేఖ వాణితోపాటు ఆమె కూతురు సుప్రీత కూడా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ను గెలిపించాలని సుప్రీత కారు ముందు నిలబడి వీడియోను క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఇటీవల కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించడంతో, ఆమె ఆ వీడియోను తొలగించి, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి(revanth reddy)తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
అంతేకాదు ఆ ఫోటో చూసిన నెటిజన్లు ఈ తల్లీ కూతుళ్లపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా దీనిపై సుప్రీత స్పందించారు. రాజకీయ వివాదంలో నన్ను ట్యాగ్ చేసి వేధిస్తున్నారని ఆమె అన్నారు. తాను మొదట BRSకి మద్దతు ఇచ్చానని.. అందులో తప్పు ఏం ఉందని ప్రశ్నించారు. అంతేకాదు ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో గెల్చిన రేవంత్ రెడ్డికి విషెస్ తెలిపినట్లు చెప్పారు. అయితే దీనిని అనేక మంది ఎందుకు తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేస్తున్నారని ప్రశ్నించింది. నేను మీకు ఏమైనా అన్యాయం చేశానా? అలాంటప్పుడు ఎందుకు తనను టార్గెట్ చేస్తున్నారని అడిగింది.
అయితే ఆమె పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. నిజానికి ఎన్నికలకు ముందు చాలా మంది సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బీఆర్ఎస్ పార్టీ, టీవీ సీరియల్ యాక్టర్లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఎన్నికల సమయంలో హైదరాబాద్ అభివృద్ధి గురించి చెబుతూ వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో షేర్ చేశారు. . అయితే వీరంతా ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో పెయిడ్ ప్రమోషన్స్‌లో భాగంగా చేసి ఉండొచ్చు. అయితే దీన్ని పట్టించుకోకుండా నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్(troll) చేస్తుండటంతో కొందరు సెలబ్రిటీలు ఈ ట్రోలింగ్ తో ఇబ్బందులు పడుతున్నారు.