ప్రస్తుతం ప్రభాస్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇదే నెలలో సలార్(salaar) రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత రానున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఆ పైన సెన్సేషన్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో యానిమల్(animal) బ్యూటీ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
సలార్(salaar) మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుండగా.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ ‘కల్కి’ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు డార్లింగ్. ఆ తర్వాత మారుతి సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలన్నీ కంప్లీట్ అవగానే సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ప్రభాస్. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుందని యానిమల్ ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి. తాజాగా ఈ సినిమాలో యానిమల్ హిట్ బ్యూటీ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. యానిమల్ సినిమాలో రష్మికతో పాటు.. మరో హాట్ బ్యూటీ తృప్తి డిమ్రీ(tripti dimri) కీలక పాత్రలో నటించింది. యానిమల్ సినిమా చూసిన వారంత ఈ బ్యూటీని అంత ఈజీగా మరిచిపోలేకపోతున్నారు. ఈ అమ్మడి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
యానిమల్ సినిమాలో బోల్డ్‌గా రెచ్చిపోయింది ఈ భామ. దీంతో తెలుగు మేకర్స్ ఈ హాట్ బ్యూటీ కోసం గట్టిగా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి అప్ కమింగ్ మూవీలో తృప్తి పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉండగానే.. ప్రభాస్ ‘స్పిరిట్(Spirit)’ మూవీలో ఈ బోల్డ్ బ్యూటీ ఫిక్స్ అయిపోయిందనే న్యూస్ వైరల్‌గా మారింది. యానిమల్ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన సందీప్ రెడ్డి.. నెక్స్ట్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈమె మెయిన్ హీరోయినా? లేక? సెకండ్ హీరోయిన్గా తీసుకుంటున్నాడా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ప్రభాస్‌తో ఛాన్స్ అంటే.. అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసినట్టేనని చెప్పాలి. ఇక స్పిరిట్ మూవీలో ప్రభాస్(Prabhas) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. మరి తృప్తి డిమ్రీ ఎలాంటి రోల్ చేస్తుందో చూడాలి మరి.