»Smuggling Of Red Sandalwood On The Highway 16 People Found Across At Chittoor
Red sandalwood: హైవేపై ఎర్రచందనం స్మగ్లింగ్.. అడ్డంగా దొరికిన 16 మంది
ఆంధ్రాలో రూ.40 లక్షలకు పైగా విలువైన ఎర్రచందనం కలప(red sandalwood)ను అక్రమంగా తరలిస్తున్న 16 మందిని పోలీసులు(police) అరెస్ట్ చేశారు. వారి నుంచి 160 కేజీల ఎర్ర చందనం కలపను స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలోని చిత్తూరు జిల్లా(chittoor District)లో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు(police) అరెస్టు చేశారు. ఈ క్రమంలో 16 మందిని అదుపులోకి తీసుకుని..వారి వద్ద నుంచి రూ.40 లక్షల విలువైన 160 కిలోల ఎర్రచందనాన్ని(red sandalwood) స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారం మేరకు పోలీసులు చెన్నై-బెంగళూరు రోడ్డులోని ఎంసీఆర్ క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా చిత్తూరు నుంచి చెన్నై(chittoor to chennai) వైపు వేగంగా వెళ్తున్న కారు వారికి కనిపించింది. ఆ క్రమంలో చెక్‌పోస్టు వద్ద ఎస్‌యూవీని ఆపి తనిఖీ చేయగా అందులో 5 ఎర్రచందనం దుంగలు లభించాయని చిత్తూరు జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ (SP) శ్రీలక్ష్మి తెలిపారు.
ఎస్‌యూవీని(SUV) అనుసరిస్తున్న మరో వాహనంలో 7 ఎర్రచందనం దుంగలు(red sandalwood) ఉన్నట్లు గుర్తించామని పోలీసు అధికారి తెలిపారు. గుడిపాల పోలీస్ స్టేషన్లో స్మగ్లర్లపై కేసు నమోదు చేశారు.
మరోవైపు డిసెంబర్ 2022లో రూ.46 లక్షల విలువైన 30 ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు(police) తెలిపారు. తిరుపతిలో పలుమార్లు దాడులు నిర్వహించగా వీరిని అరెస్టు చేశారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.