»Farming Of Lions In South Africa Huge Smuggling Of Their Bones
Lions Farming: సింహాల ఫార్మింగ్.. వాటి ఎముకలతో భారీ స్మగ్లింగ్
సింహాలను బోనులో పెంచి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వాటి దంతాలన, ఎముకలను వైద్యరంగంలో అక్రమంగా విక్రయిస్తున్నారు. 8వేలకు పైగా సింహాలను బోనులో బందించారు.
Farming of lions in South Africa.. Huge smuggling of their bones
Lions Farming: సాధారాణంగా కోళ్లు(Hen), మేకలు(Goat), చేపల(Fish)ను పెంచడం చూశాము కాని సింహాల ఫార్మింగ్( Lions Farming ) కూడా ఉంటుందని ఎవరికి తెలియదు. సింహాల సాగులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ(Oxford University)కి చెందిన గ్లోబల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యూనిట్ హెడ్ నీల్ డి క్రూజ్, మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన వైల్డ్ లైఫ్ రిసెర్చ్ మేనేజర్ ఆంజీ ఎల్విన్ తమ బ్లాగ్లో ఈ విషయాన్ని తెలిపారు. అడవి సింహాలను వేటాడి బందించి వాటి సంఖ్యను పెంచుతున్నట్లు వారు తెలిపారు. దక్షిణాఫ్రికాలో అడవి జంతువుల ఎముకల వ్యాపారం గత కొంత కాలంగా బాగా పెరిగింది. ఇక్కడ 350కి పైగా వ్యాపార కేంద్రాల్లో దాదాపు 8,000 సింహాలు బందీగా ఉన్నాయని వారు చెప్పారు. నిజానికి ఆ దేశపు సింహాల అంచనా 3,500 కాగా దీనికి రెండింతలు వ్యాపార కేంద్రాలలో ఉండటం ఆశ్చార్యాన్ని కలిగిస్తుంది.
అడవి జంతువులను పెంచే వ్యాపారులకు, స్మగ్లింగ్ మాఫియాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. లైసెన్స్ వ్యాపారం పేరుతో మాఫియా ముఠాలు చట్టవ్యతిరేక కార్యకలాపాలను పాల్పడుతున్నారు. బడా మాఫియా ముఠాల చేతుల్లో ఈ వ్యాపార కేంద్రాలువున్నాయని నీల్ డి క్రూజ్, ఆంజీ ఎల్విన్ తమ బ్లాగ్లో పేర్కొన్నారు. ఈ ముఠాలు అనేక పద్ధతుల్లో సింహాల సంఖ్యను పెంచుతారు. కోట్ల రూపాయల టర్నోవర్తో ఈ వ్యాపారం నడుస్తున్నది. టూరిజం పేరుతో సింహం కూనల కేంద్రాలు, సింహాల పార్కులు, సింహాలను వేటాడి, బోనులో బంధించటం, వాటిని సజీవంగా ఎగుమతి చేయటం, వాటి వివిధ శరీర భాగాలను సంప్రదాయ మందుల కోసం సరఫరా చేయడం వంటి అక్రమ వ్యాపారాల్లో ఈ ముఠాలు మునిగితేలుతున్నాయని అంటున్నారు. ఈ సమయాల్లో మృగరాజులు తీవ్ర హింసకు గురవుతున్నాయని వారు అన్నారు. సింహాల కళేబరాల నుంచి వాటి ఎముకలు, పంజాలు, తలలు, పుర్రెలు, దంతాలు తదితరాలను చట్ట వ్యతిరేకంగా స్మగ్లింగ్ చేస్తున్నారని తెలుస్తున్నది. ఈ విషయంపై 2019లో దక్షిణాఫ్రికా హైకోర్టు స్పందిస్తూ.. సింహాల ఎముకల ఎగుమతి చట్టవ్యతిరేకమని తీర్పు చెప్పింది. అయినా సరే ఈ వ్యాపారం బహిరంగంగానే జరుగుతున్నది.