»Yevgeny Prigozhin Is Dead What Is Going On In Wagners Military Group
Yevgeny Prigozhin: ప్రిగోజిన్ చనిపోయాడా..? అసలు ఏం జరుగుతోంది?
రష్యా ప్రైవేట్ సైన్యాధ్యక్షడు ప్రిగోజిన్ మరణించడం యాదృచ్చికమా లేదా స్కాం ప్రకారమే జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతుంది. ఈ నేపథ్యంలో అతని మరణానికి ముందు రోజు జరిగిన కొన్ని సంఘటనలు తెరమీదకు వచ్చాయి. అవెంటీ అసలు నిజంగా మరణించాడా అనేది ఇప్పుడు చుద్దాం.
Yevgeny Prigozhin is dead.. What is going on in Wagner's military group?
Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్(Vladimir Putin) పొలిటికల్ సర్కిల్లో ప్రిగోజిన్(Prigogine) ముఖ్యమైన వ్యక్తి, పుతిన్ చెఫ్‌గా ఆయన్ను వ్యవహరిస్తుంటారు. పుతిన్ ప్రైవేట్ సైన్యం వాగ్నెర్(Wagner)కు బాస్ యెవ్జెనీ ప్రిగోజిన్ తాజాగా విమాన ప్రమాదంలో మరణించడాన్న వార్త అందిరికి తెలుసు. అయితే అతని మరణానికి ముందు రోజు జరిగిన పరిణామాలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. ఉక్రెయిన్ (Ukraine)పై సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్.. జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన ప్రభుత్వంపై ఎదురు తిరిగారు. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా రష్యా ఉలిక్కిపడింది.
వాగ్నెర్ సైనిక నాయకత్వం నుంచి ప్రిగోజిన్ తప్పుకున్న తరువాత, వాగ్నర్ గ్రూప్ సైన్యం రష్యాలోనే ఉంటారని మిత్రదేశాలకు భరోసా ఇవ్వడానికి ఒక రష్యన్ అధికారి లిబియాను సందర్శించారు. బెంఘాజీలో జరిగిన సమావేశంలో రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ యూనస్-బెక్ యెవ్కురోవ్ మంగళవారం తూర్పు లిబియా కమాండర్ ఖలీఫా హఫ్తార్‌తో మాట్లాడుతూ..వాగ్నెర్ దళాలు కొత్త కమాండర్‌కు రిపోర్ట్ చేస్తారని చెప్పారు. దీని తరువాత ప్రిగోజిన్ మరణించాడని తెలుస్తోంది. అయితే ఇది యాదృచ్చికం తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. యెవ్కురోవ్ సందర్శనను ఉద్దేశించి ప్రిగోజిన్ మరణానికి, ఆయన పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్కు చెందిన లిబియా పరిశోధకుడు జలేల్ హర్చౌయి అన్నారు.
ఇప్పుడు అందరూ ప్రిగోజిన్ చనిపోయాడని అంటున్నారు. వాగ్నెర్ సైన్యంతో ఉక్రెయిన్‌లో ప్రిగోజిన్ గొప్ప యుద్దం చేశాడు. సిరియా, లిబియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, మాలిలో అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లలో పోరాడాడు. అక్కడ బంగారు గనులు, చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకున్నాడు. ప్రిగోజిన్ పుతిన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తరువాత వాగ్నెర్ దళాలకు రష్యా మిలటరీ స్థావరాన్ని ఇచ్చింది. అయితే అందులో ఎంత మంది ఉన్నారు అనేది స్పష్టత లేదు. ఇదిలా ఉంటే ప్రిగోజిన్ సోమవారం విడుదల చేసిన ఒక వీడియోలో వాగ్నెర్ సైన్యం ఆఫ్రికాలో తమ ఉనికిని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించాడు. అంటే వాగ్నెర్ సైన్యం ఎవరి నియంత్రణలో పనిచేస్తుంది అనేది ప్రశ్నగా మారింది.
CARలో ప్రెసిడెంట్ ఫాస్టిన్-ఆర్చేంజ్ టౌడెరా రాజకీయ సలహాదారు ఫిడేల్ గౌండ్జికా ప్రిగోజిన్ మరణం చాలా విచారం అని విలపించారు. ఎందుకంటే పౌర యుద్ధంలో ప్రభుత్వానికి సహాయం చేయడంలో, ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో సహాయం చేశారు. ప్రిగోజిన్ ఓ గొప్ప నాయకుడు. మేము అతనిని భర్తీ చేయగలము అని గౌండ్జికా అన్నారు. ఇక అతని ఆస్తుల గురించి కూడా సరైన సమాచారం ఎవరికి లేదని చెప్పారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. రష్యాలో పుతిన్ అనుమతి లేకుండా చీమకూడా కదలదని ఇంతటి ప్రమాదం ఎలా జరుగుతోంది అన్నారు. రష్యాపై తిరుగుబాటు చేసిన సందర్భంలో ప్రిగోజిన్‌కు విషప్రయోగం జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇప్పుడు విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించడంతో అది కచ్చితంగా కుట్ర అయి ఉంటుందని చాలా మంది ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.