Chandrayaan-3 Lander Shares Its First Video From Moon's Surface
Chandrayaan-3: చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడిన విక్రమ్ ల్యాండర్ తాజాగా ఓ వీడియోను పంపించింది. అందులో మట్టి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోను ఇస్రో (isro) కాసేపటి క్రితం షేర్ చేసింది. బుధవారం సాయంత్రం విక్రమ్ ల్యాండర్ అడుగిడిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్తో చంద్రునిపై ఇస్రో (isro) ల్యాండర్ అడుగిడటంతో భారతీయులు మురిసిపోయారు. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ దూసుకెళ్లే దృశ్యాన్ని వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.
బుధవారం సాయంత్రం చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సాప్ట్ ల్యాండ్ అయ్యింది. చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగిన నాలుగో దేశంగా భారత్ (india) నిలిచింది. చంద్రుని ఉపరితలంపై చాలా సమస్యలు ఉన్నాయని ఇస్రో (isro) చెబుతోంది. ధూళి, ఉష్ణోగ్రత.. కదిలే భాగాలపై ప్రభావం చూపుతాయని అంటోంది. చంద్రునిపై అడుగిడేందుకు భారత్ చేసిన మూడో ప్రయత్నం ఇదీ.. 2019 సెప్టెంబర్లో చంద్రునిపై ల్యాండర్ క్రాష్ అయ్యింది. పాక్షిక ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత ఇటీవల విక్రమ్ ల్యాండర్ ప్రయోగించారు.