»Chandrayaan 3 Propulsion Module Moves From Lunar Orbit To Earth Orbit
ISRO: భారత్ మరో విజయం.. భూ కక్ష్య దిశగా ప్రొపల్షన్ మాడ్యుల్!
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రొపల్షన్ మాడ్యుల్ తిరిగి భూ కక్ష్యలోకి మళ్లించినట్లు తాజాగా ఇస్రో తెలిపింది. దీనితో భూమిపై మరిన్ని ప్రయోగాలు చేయొచ్చని వెల్లడించింది.
chandrayaan-3 propulsion module moves from lunar orbit to earth orbit
ISRO: చంద్రయాన్-3(Chandrayaan-3) ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచదేశాలు భారత్ వైపు చూశాయి. ఈ ఘనత సాధించిన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో కీలక ప్రాజెక్ట్‌ను చేపట్టింది. చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి కక్ష్యలోకి పంపిన పరికరాలను వెనక్కి తీసుకొచ్చే ప్రయోగం మొదలు పెట్టింది. ప్రొపల్షన్ మాడ్యుల్(propulsion module)ను తాజాగా చంద్రుడి కక్ష్య నుంచి తిరిగి భూకక్ష్య వైపు తీసుకొస్తున్నట్లు ఇస్రో(ISRO) తెలిపింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇస్రో ట్వీట్ చేసింది. కక్ష్య పొడిగింపు, ట్రాన్స్ ఎర్త్ ఇంజెక్షన్ విన్యాసాలతో ఈ ఫీట్‌ను సాధించినట్లు పేర్కొంది.
భారత్ ప్రొపల్షన్ మాడ్యుల్ మార్గాన్ని తగ్గించడంలో దాదాపు 100 కిలోల ఇంధనం దీనిలో మిగిలింది. దాన్ని వాడుకొని మరికొన్ని పరిశోధనలు ఇస్రో చేసింది. తర్వాత చంద్రుడి కక్ష్య నుంచి మాడ్యూల్ మార్గాన్ని భూకక్ష్య వైపు మళ్లించారు. దీనిపై ఉన్న SHAPE పేలోడ్ భూమిపై పరిశోధనలు కొనసాగించనుంది. భూమి జియో బెల్ట్‌లోకి ప్రవేశించే సమయంలో సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తులో, దిగువ కక్ష్యలోకి వచ్చే మార్గంలో ఉపగ్రహాలను ఢీకొనకుండా ముందుగానే మన శాస్త్రవేత్తలు జాగ్రత్త పడ్డారు. చంద్రయాన్-3లో ఉండే మూడు ప్రధాన భాగాల్లో ప్రొపల్షన్ మాడ్యుల్ ఒకటి. దీంతో పాటు ల్యాండర్ మాడ్యుల్, రోవర్ ఉంటాయి. ప్రొపల్షన్ మాడ్యుల్‌తో ల్యాండర్ మాడ్యుల్ అనుసంధానమై ఉంటుంది. వాహకనౌక నుంచి విడిపోయి, ల్యాండర్ మాడ్యుల్‌ను చంద్రుడికి 100 కి.మీ. దగ్గరకు తీసుకెళ్లింది. అక్కడ ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండర్ మాడ్యుల్ విడిపోయింది. అలా ప్రొపల్షన్ మాడ్యుల్ కొన్ని నెలల పాటు చంద్రడి కక్ష్యలోనే ఉంది. అక్కడి నుంచి సమాచారం పంపింది. తాజాగా శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగంతో మళ్లీ భూ కక్ష్య(earth orbit)లోకి వచ్చింది.