WWE సూపర్‌స్టార్, ప్రొ రెజ్లర్ ఛాంపియన్ బ్రే వ్యాట్ అనారోగ్యంతో 36 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ఇది తెలిసిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అతనికి నివాళులు ప్రకటిస్తున్నారు. రిప్ లెజెండ్ అంటూ గుర్తు చేసుకుంటున్నారు.
Shocking star pro wrestler Bray Wyatt died at the age of 36
WWE సూపర్‌స్టార్, మాజీ ప్రొ రెజ్లర్ ఛాంపియన్ బ్రే వ్యాట్(Bray Wyatt) 36 ఏళ్ల వయస్సులోనే మరణించినట్లు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ పాల్ ‘ట్రిపుల్ హెచ్’ లెవెస్క్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వ్యాట్ అసలు పేరు విండ్మ్యామ్ రోటుండా. ఫిబ్రవరిలో WWE TV నుంచి అతను తప్పుకున్న తర్వాత ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి బ్రే వ్యాట్ ఎక్కువగా కనిపించలేదు. బ్రే వ్యాట్ గత సంవత్సరం ఎక్స్ట్రీమ్ రూల్స్‌లో WWEకి తిరిగి వచ్చాడు. ఆ క్రమంలో అనేక మంది అభిమానులచే మంచి ఆదరణ కూడా పొందాడు. ఆ నేపథ్యంలో బాబీ లాష్లేతో షెడ్యూల్ చేయబడింది. కానీ తర్వాత ఆకస్మాత్తుగా క్యాన్సిల్ చేశారు. వ్యాట్ హాజరుకాలేదు. అయితే ఎందుకు రద్దు చేయబడిందనే దానికి సరైన కారణం ఇవ్వలేదు. తర్వాత ఆ ప్రో రెజ్లర్ ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది.
Just received a call from WWE Hall of Famer Mike Rotunda who informed us of the tragic news that our WWE family member for life Windham Rotunda – also known as Bray Wyatt – unexpectedly passed earlier today. Our thoughts are with his family and we ask that everyone respect their…
విండ్మ్ రోటుండా మరణ వార్తతో ప్రో-రెజ్లింగ్ ఫ్యామిలీ దిగ్భ్రాంతికి గురైంది. బ్రే వ్యాట్ WWE సూపర్ స్టార్ తెలియనివారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పుకొవచ్చు. బ్రే వ్యాట్ ఈ ఏడాది ప్రారంభంలో కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత అతను గుండె సంబంధింత సమస్యలతో ఇబ్బంది పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇటివల అతను గుండెపోటు మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్త వైరల్ తెలిసిన వెంటనే పలువురు ప్రో-రెజ్లింగ్ సూపర్ స్టార్లు సోషల్ మీడియాలో అతనికి నివాళులు అర్పించారు. డ్వేన్ జాన్సన్ అకా ది రాక్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసి అతనిని గుర్తు చేసుకున్నారు.
Im heartbroken over the news of Bray Wyatt’s passing. Always had tremendous respect and love for him and the Rotunda family. Loved his presence, promos, in ring work and connection with @wwe universe. Very unique, cool and rare character, which is hard to create in our crazy… pic.twitter.com/i9zlbJIOL3