Visa Scam: వీసా స్కామ్‌లో భారీగా ఇరుక్కుపోయిన నైజీరియన్లు
యునైటెడ్ కింగ్డమ్లో వర్క్ వీసాలతో లేని ఉద్యోగ అవకాశాల కోసం మొత్తాన్ని చెల్లించి నైజీరియన్ల భారీ సంఖ్యలో మోసపోతున్నట్ల తాజాగా ఒక నివేదిక వెల్లడించింది.
Visa Scam: యునైటెడ్ కింగ్డమ్(United Kingdom)లో వర్క్ వీసాల పేరుతో నైజీరియన్ల భారీ సంఖ్యలో మోసపోతున్నట్ల తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. నైజీరియన్(Nigerians) వలసదారులను ట్రావెలింగ్ ఏజెంట్లు UKలో ఉద్యోగావకాశాలు ఇప్పిస్తామని చెప్పి అధిక మొత్తంలో డబ్బులు కట్టించుకొని మోసం చేస్తున్నారు. తీరా వర్క్ వీసా(Work visa)తో ఆ దేశం వెళ్లిన తరువాత నిర్దేశించిన వర్క్ లేదని, తిరిగివచ్చేందుకు డబ్బులు లేవని నైజీరియన్లు వాపోతున్నారు. ఈ సందర్భంగా ఓ నివేదిక వీరి గురించి వెల్లడించింది. చాలా మంది ఉపాధి మీద ఆశతో వర్క్ వీసాతో మధ్యవర్తులను నమ్మి డబ్బులు మోసపోతున్నారని, అంతేకాకుండా తీరా అక్కడికి వెళ్లాక తగిన పనిలేక, ఆహారం లేక ఆ దేశంలో ఉన్న ఫుడ్ బ్యాంక్‌లను ఆశ్రయిస్తున్నట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం, కేవలం 12 నెలల్లో, ఆరోగ్యం, సంరక్షణ రంగంలో 170,993 వర్క్ వీసాలు మంజూరు అయ్యాయని తెలిపింది. దీని వలన చాలా మంది యూకేలో ఉపాధి లేకుండా తిరుగుతున్నారని, దీనిపై ఆ ప్రభుత్వాలు నిఘా పెడితే వీరిని శిక్షర్హులగా ప్రకటించే అవకాశం ఉందని ఆ నివేదిక వెల్లడించింది.