ఎర్రచందనం కేసులో జబర్దస్త్ (Jabardast) కమెడియన్ హరి పేరు మరోసారి తెరపై వచ్చింది. చిత్తూరు జిల్లా పుంగనూరు(Punganur)లో అటవీశాఖ (Forest Department) పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం(Red Sandalwood) దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అతని ముఠాకు చెందిన కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.రూ.60 లక్షల విలువైన 19 ఎర్రచందనం దుంగలతోపాటు రెండు కార్లను స్వాదీనం చేసుకున్నారు. గతంలోనూ ఎర్రచందనం స్మగ్లింగ్(Smuggling) చేస్తూ ఆయన పోలీసులకు పట్టుబడ్డారు. ఇప్పటికే హరి(Hari)పై పలు సెక్షన కింద కేసులు నమోదు అయ్యాయి. కాగా జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ ద్వారా హరి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు. హరికి పలువులు స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు (police) గుర్తించారు. గతంలోనూ అతనిపై పలుమార్లు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదుయ్యిని పలమనేరు (Palamaneru) డీఎస్పీ తెలిపారు.