»Tdp Leaders Appealed To Governor Suspends Minister Peddireddy
Minister పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయండి, గవర్నర్‌ను కోరిన టీడీపీ
పుంగనూర్ ఘర్షణకు కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని టీడీపీ నేతలు అంటున్నారు. అతనిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కలిసి విన్నవించారు.
TDP Leaders Appealed To Governor Suspends Minister Peddireddy
TDP Leaders Appealed To Governor Suspends Minister Peddireddy
Minister Peddireddy: పుంగనూర్ ఘర్షణ ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచింది. టీడీపీ- వైసీపీ శ్రేణుల ఘర్షణతో అక్కడ యుద్ద వాతావరణం నెలకొంది. ఈ రోజు వైసీపీకి బంద్‌కు పిలుపునివ్వగా.. టీడీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. నిన్న జరిగిన ఘర్షణకు సంబంధించి ఆధారాలు, ఫోటోలు, వీడియోలను అందజేశారు. పులివెందులలో చంద్రబాబు (chandrababu) సభకు వచ్చిన జనాన్ని చూసి వైసీపీ నేతలు తోక ముడిచారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (varla ramaiah) అన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) అనుచరులు అంగళ్లులో గొడవకు దిగారని ఆరోపించారు. ఘటనకు మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) కారణం అని.. ఆయనపై శ్రేణులకు సారా పోసి చంద్రబాబు సబపై దాడులు చేయించారని ఆరోపించారు. ఘటనకు కుట్రదారు పెద్దిరెడ్డి (Peddireddy) అని.. ఆయనను అరెస్ట్ చేయాలని కోరారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని విన్నవించారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. ఎస్పీ రిషాంత్ రెడ్డి పోలీసు లాగా కాకుండా వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సమస్యలపై కలిసేందుకు కోరితే గవర్నర్ టైమ్ ఇస్తున్నారు కానీ.. డీజీపీ మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబును (chandrababu) అంతం చేయాలనే దుర్మార్గ ఆలోచనతో జగన్ రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు అన్నారు. గతంలో అమరావతిలో చంద్రబాబు బస్సుపై దాడి చేయించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఇంటి మీద, టీడీపీ ఆఫీసు మీద దాడులు జరిగాయని పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటిస్తుంటే దారిలో వైసీపీ నేతలను పోలీసులు ఎందుకు అనుమతించారని అడిగారు.