»Former Pakistan Prime Minister Imran Khan Jailed For Selling Gifts
Imran khan: గిఫ్టులు అమ్ముకున్నాడని మాజీ ప్రధానికి జైలు శిక్ష
ప్రభుత్వ బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు పాకిస్థాన్ మాజీ ప్రధాని(pakistan Former Prime Minister) ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు శనివారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
పాకిస్థాన్(pakistan Former Prime Minister) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(imran khan)కు మూడేళ్ల జైలు(jailed) శిక్ష పడింది. శనివారం (ఆగస్టు 5) జిల్లా సెషన్స్ కోర్టు తోషాఖానా అవినీతి కేసులో ఖాన్‌ను దోషిగా నిర్ధారించి జైలు శిక్షను ప్రకటించింది. అంతేకాదు కోర్టు చీఫ్‌కి రూ.100,000 జరిమానా కూడా విధించింది. దోషిగా తేలిన వెంటనే లాహోర్‌లోని జమాన్ పార్క్ నివాసం నుంచి ఖాన్‌ను అరెస్టు చేశారు. అయితే ఖాన్, ప్రధానమంత్రిగా ఉన్న క్రమంలో ఖరీదైన గ్రాఫ్ చేతి గడియారంతో సహా పలు బహుమతులను కొనుగోలు చేసి, తోషాఖానా అనే స్టేట్ డిపాజిటరీ నుంచి తగ్గింపు ధరకు వాటిని విక్రయించారని కేసు నమోదైంది.
తోషాఖానా బహుమతులను అక్రమంగా విక్రయించాడనే ఆరోపణలపై ఖాన్ విచారణను ఇస్లామాబాద్ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువడింది. మరోవైపు ఖాన్ న్యాయ బృందం కమిషన్ ఫిర్యాదును సవాలు చేసింది. ఇది క్రిమినల్ కేసు కాదని, విచారణను నిర్వహిస్తున్న న్యాయమూర్తి మాజీ ప్రధానిపై పక్షపాతంతో వ్యవహరించారని వాదించారు.