Free Gifts: ఫ్రీగా ఇస్తున్నామంటే చాలు.. ఎగబడటం ఖాయం. పేద దేశాలు, డెవలప్ అవుతోన్న దేశాల్లో జనాలు.. వారి అటిట్యూడ్ అలా ఉంటుందని అనుకోవచ్చు. మరీ అగ్రరాజ్యం అమెరికా అయితే బెటర్ అనుకుంటారు. కానీ అలా కాదు.. అక్కడ కూడా జనం క్యూ కడతారు. అవును ఫ్రీగా ఇస్తామంటే చాలు.. తండోప తండాలుగా వస్తుంటారు. ఆన్ లైన్ ఇన్ఫ్లూయెన్సర్ కై సీనట్ (Kai Cenat) గిప్ట్స్ ఇస్తానని ప్రకటించడంతో న్యూయార్క్‌లో గల మన్ హటన్ యూనియన్ స్క్వేర్ పార్క్ వద్దకు భారీగా జనం వచ్చారు.
లైవ్ స్ట్రీమింగ్ (streaming) ఈవెంట్ ఏర్పాటు చేస్తానని ఇన్ స్టాలో కై సీనట్ (Kai Cenat) ప్రకటించాడు. శుక్రవారం సాయంత్రం అభిమానులను కలుస్తానని.. ప్లే స్టేషన్ 5 గేమ్ కన్సోల్స్ సహా గిప్ట్స్ ఇస్తానని అందులో పేర్కొన్నాడు. ఆ పోస్ట్ చూసిన జనం.. అక్కడికి వచ్చారు. 2 వేలకు పైగా యువత వచ్చింది. దీంతో ఆ వీధి ఇసుకవేస్తే రాలని పరిస్థితి ఏర్పడింది. అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు తంటాలు పడ్డారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కొందరు అభిమానులు (fans) పార్క్ వీధుల్లో వాహనాలు అడ్డగించారు. ఒకరినొకరు తోసుకున్నారు. మరికొందరు బాటిళ్లు విసురుకున్నారు. ఇంకొందరు కార్లను ధ్వంసం చేశారు. మరికొందరు నినాదాలు చేశారు. ఈ ఘటనతో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సీనట్‌ను మరో ప్రాంతానికి తరలించారు. అల్లర్లను ప్రేరేపించినందుకు సీటన్పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అంటున్నారు.
సీనట్ (Kai Cenat) వయస్సు 21 ఏళ్లే.. కానీ అతను పాపులర్ వీడియో క్రియేటర్.. ట్విచ్ అనే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌లో అతనికి 65 లక్షల మంది ఫాలొవర్లు ఉన్నారు. యూట్యూబ్, ట్విట్టర్లో లక్షల మంది అభిమానులు ఉన్నారు. లాస్ట్ ఇయర్ స్ట్రీమర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలువడంతో మరింత పేరు వచ్చింది.