»Searches In Former Cmd Gupta House Seizes Rs 38 Crore Delhi
Seizes: మాజీ CMD ఇంట్లో సోదాలు రూ.38 కోట్లు పట్టివేత
వాప్కోస్ మాజీ సీఎండీ(former CMD gupta) ఇళ్లపై ఆకస్మాత్తుగా సీబీఐ(CBI) దాడులు నిర్వహించగా..పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. దీంతోపాటు మాజీ సీఎండీ, అతని భార్య రీమా సింగల్, అతని కుమారుడు గౌరవ్ సింగల్, అతని కోడలు కోమల్ సింగల్లపై కేసు నమోదు చేశారు.
వాప్కోస్ మాజీ సీఎండీ రాజిందర్ కుమార్ గుప్తా(Rajinder Kumar Gupta)ఆస్తులపై సీబీఐ(CBI) ఆకస్మాత్తుగా సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో రూ.38 కోట్లకు పైగా నగదు రికవరీ అయింది. చండీగఢ్, ఢిల్లీ, గురుగ్రామ్, పంచకుల, సోనిపట్లలో ఈ దాడులు జరిగుతున్నాయి. దాడులు ఇంకా కొనసాగుతున్నందున రికవరీ చేయబడిన మొత్తం నగదు పరిమాణం ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఈ క్రమంలో వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మాజీ సీఎండీని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈరోజు ఉదయం సోదాలు ప్రారంభించారు. మొత్తం దాదాపు రూ.38.38 కోట్ల నగదు(cash) సోదాల్లో దొరికింది. ఆ క్రమంలో ఆ నగదును లెక్కించేందుకు వారు బ్యాంకు అధికారులు, కరెన్సీ లెక్కింపు యంత్రాల సహాయం తీసుకున్నారు. దీంతోపాటు రాజిందర్ కుమార్ గుప్తా, అతని కొడుకును అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు దాచడం గురించి ఎటువంటి వివరణ లేని కారణంగా సిబిఐకి వారిని అరెస్టు చేసింది.
మాజీ CMD వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్, అతని కుటుంబ సభ్యులపై 01.04.2011 నుంచి 2019 వరకు అతనిపై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో కేసు నమోదు చేయబడింది. ఆ క్రమంలో ఆదాయానికి మించి పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నాడని సీబీఐ సోదాల్లో తేలింది. ఈ నేపథ్యంలో వాప్కాస్ మాజీ సీఎండీ రాజిందర్ కుమార్ గుప్తా, ఆయన భార్య రీమా సింగల్, ఆయన కుమారుడు గౌరవ్ సింగల్, ఆయన కోడలు కోమల్ సింగల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ మంగళవారం వెల్లడించింది.