KRNL: ఇటీవల రాయలసీమ యూనివర్సిటీ హాస్టల్లో గదిలో ఓ విద్యార్థి మరో విద్యార్థిపై సిగరెట్‌తో కాల్చిన ఘటనలో భాగంగా కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు ఉపకులపతి బసవరావు, రిజిస్టర్ విజయకుమార్ నాయుడులు తెలిపారు. బుధవారం యూనివర్సిటీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. RU కాన్వకేషన్ విజయవంతంలో ప్రతిఒక్కరు కీలక పాత్రను పోషించారన్నారు.
KDP: జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్ ఇవాళ తన సొంత నియోజకవర్గంలో రైతులను పరామర్శించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. జగన్ దారి మధ్యలో వెళ్తూ ప్రజలతో మమేకమై మాట్లాడుకుంటూ వెళ్లారు. అందులో ఆయనను కలవడానికి స్థానికంగా పిల్లలు వచ్చారు. వారితో ఆయన ఆప్యాయంగా మాట్లాడుతూ.. సెల్పీ తీసుకున్నారు. బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.
VSP: అల్లూరి జిల్లా విద్యార్థిని విశాఖపట్నంలో బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హుకుంపేట మండలం రాప గ్రామానికి చెందిన శోభ నందిని (19) కృష్ణా కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మద్దిలపాలెంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు నందని కుటుంబ సభ్యులుకు సమాచారం తెలియజేశారు.
KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీకి ఆఫ్రికా విశ్వవిద్యాలయం ఈనెల 30న డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ‘మైల్స్ నాయకత్వం’ అనే అంశంపై ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు డాక్టరేట్ ఎంపిక అయినట్లు శ్రీ మఠం అధికారులు తెలిపారు. అధికారులు, సిబ్బంది పీఠాధిపతికి శుభాకాంక్షలు తెలిపారు.
కృష్ణా: కోడూరు మండలం ఉల్లిపాలెం భవానిపురం వీధికి ఇరుపక్కల అప్రోచ్‌ను తక్షణమే నిర్మించాలని మండల బీజేపీ నాయకులు కోరారు. బుధవారం అవనిగడ్డలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌కు వారు వినతిపత్రం అందించారు. వారధి ఎక్కే అప్రోచ్‌లు పల్లంగా ఉండటం వల్ల వాహనాలు ఎక్కే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
VZM: కూటమి ప్రభుత్వం పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాజాం YCP ఇన్‌చార్జ్ తలే రాజేష్ ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలు వల్ల రైతులు మానసికంగా ఆర్ధికంగా ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. అకాల వర్షాలు తుపానుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం రైతుల పంటలకు గిట్టుబాటు కల్పించడం లేదన్నారు.
CTR: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడుతుందని APSDMA వెల్లడించింది. ఇది ఈ నెల 29 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు మోస్తరు వర్షాలు, ఎల్లుండి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వానలు కురుస్తాయని పేర్కొంది.
ELR: తన సోదరి అనారోగ్య కారణాలతో బాధపడుతుండడంతో మనస్తాపం చెందిన ఏలూరు మెడికల్ కాలేజీ విద్యార్థి అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెంకు చెందిన జగదీష్ ప్రస్తుతం వైద్య విద్య 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఉత్తమ విద్యార్థిగా ప్రతిభ కనబరుస్తున్న అతను బుధవారం ఈ ఘటనకు పాల్పడ్డాడు.
KRNL: ఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను బుధవారం రాత్రి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కలిశారు. ఇందులో భాగంగా ఆయన జిల్లాకు క్రీడల్లో ప్రాధాన్య త ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా కింద రూ. 45.16 కోట్ల స్పోర్ట్స్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని వివరాలు అందజేశారు.
అన్నమయ్య: రైల్వే కోడూరులో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, పదోన్నతి పొందిన కార్యదర్శి రవీంద్ర వర్మకు సన్మానం చేశారు. కొత్త కార్యదర్శిగా జై సూర్య, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ మనోజ్ చంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షులు బి శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తూ.గో: జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఇవాళ, రేపు అందుబాటులో ఉండరని ఆయన క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. విజయవాడ (అమరావతి ) వెళ్లిన సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయంలో, ఇర్రిపాక గ్రామంలో అందుబాటులో ఉండరు. కావున కార్యకర్తలు, అధికారులు, కూటమి నాయకులు గమనించాలి కోరారు.
VZM: ఈ నెల 29 న జామి MRO కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి బుధవారం తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుందని మండలంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందించాలని, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.
సత్యసాయి: రాయలసీమలోనే అతిపెద్ద చెరువు అయిన బుక్కపట్నం చెరువు (8,200 ఎకరాల ఆయకట్టు)లోకి CM చంద్రబాబు నాయుడు చొరవతో హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణమ్మ నీరు చేరింది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ చెరువుకు కర్ణాటకలోని పరగోడు రిజర్వాయర్ కారణంగా నీరు ఆగిపోయింది. ఇప్పుడు కృష్ణమ్మ జలాలతో 8 వేల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం అవుతోంది.
GNTR: పట్టాభిపురం పీఎస్ పరిధిలో పేకాట ఆడుతున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ బృందం బుధవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.76,300 నగదు, 11 సెల్‌ఫోన్లు, 2 కార్లు, 4 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, ఫోన్ పే ద్వారా రూ.2,51,100 ఆన్‌లైన్ లావాదేవీలను గుర్తించామని పోలీసులు తెలిపారు. మొత్తం లావాదేవీల విలువ రూ.3,27,400కు చేరిందని వెల్లడించారు.
KKD: శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో నేటి నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు సామర్లకోట భీమేశ్వరాలయం వద్ద ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నట్లు భీమేశ్వరాలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ జగదీష్మాహన్ తెలిపారు. 25 మంది వైద్య నిపుణులతో పరీక్షలు నిర్వహించి, అవసరం అయిన వారికి శస్త్రచికిత్సలు చేస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.