• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘అప్పులు చేసి కళాశాలకు ఫీజులు కట్టాల్సి వస్తుంది’

NTR: పెండింగ్‌లో ఉన్న 6400 కోట్ల ఫీజు రీయింబర్స్, తల్లికి వందనం వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు గోపినాయక్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 5, 6 తేదీల్లో తిరువూరులో జరిగే ఎన్టీఆర్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కంచికచర్ల ఎన్టీఆర్ జూనియర్ కాలేజీలో మహాసభ పోస్టర్ ఆవిష్కరించారు. అప్పులు చేసి కళాశాలకు ఫీజులు కట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు.

November 28, 2025 / 12:31 PM IST

జిల్లా పేరు మార్పుపై రౌండ్ టేబుల్ సమావేశం

ELR: ఏలూరు జిల్లాను ‘గోదావరి జిల్లా’ లేదా ‘ఉత్తర గోదావరి జిల్లా’ గా పేరు మార్చాలనే డిమాండ్ పై జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తమ ప్రాంతానికి గోదావరి అనుబంధాన్ని చాటే పేరు కావాలని మెట్ట ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని సమావేశంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.

November 28, 2025 / 12:28 PM IST

గుత్తిలో ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

ATP: గుత్తి ఆర్ఎస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్ఎస్ లోనే రైల్వే కోటర్స్‌లో జ్యోతి అనే మహిళ శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

November 28, 2025 / 12:28 PM IST

కర్నూలు మార్కెట్‌పై జాయింట్ కలెక్టర్ తనిఖీ

కర్నూలు మార్కెట్ యార్డును జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. యార్డు ప్రాంగణం, డైనింగ్ హాల్, వాష్‌రూమ్‌లు, మినరల్ వాటర్ ప్లాంట్లు, సీసీ కెమెరాలను పరిశీలించారు. శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, చెత్తను ప్రతిరోజూ తొలగించాలని, రైతులకు అవసరమైన సౌకర్యాలు అందించాలని కార్యదర్శి జయలక్ష్మికి సూచించారు.

November 28, 2025 / 12:27 PM IST

స్పీడ్ బ్రేకర్స్‌ను సరి చేస్తున్న అధికారులు

అనకాపల్లి పట్టణం విజయరామరాజుపేట రైల్వే గేటు వద్ద నిర్మించిన అతిపెద్ద స్పీడ్ బ్రేకర్స్‌పై స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో అధికారులు వాటిని సరిచేస్తున్నారు. ఈనెల 27న కూటమి నాయకులు, వైసీపీ శ్రేణులు వేరువేరుగా నిరసన తెలియజేశారు. ఈ విషయం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించారు.

November 28, 2025 / 12:26 PM IST

రైతు అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి MLA

SKLM: రైతు అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి అని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. శుక్రవారం పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు హాజరయ్యారు. రైతును రాజును చేయడం కూటమి ప్రభుత్వం ధ్యేయం అని పేర్కొన్నారు.

November 28, 2025 / 12:16 PM IST

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించిన దద్దాల

ప్రకాశం: విజయవాడ జిల్లా జైలు నందు లిక్కర్ అక్రమ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని శుక్రవారం కనిగిరి వైసీపీ ఇంఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పరామర్శించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించిన వారిలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్, గిద్దలూరు వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు ఉన్నారు.

November 28, 2025 / 12:15 PM IST

మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి సవిత భర్త

సత్యసాయి: పెనుకొండ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బట్టా బాలకృష్ణ చౌదరి అనారోగ్యంతో బాధపడుతు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పెనుకొండ టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు శుక్రవారం కొండంపల్లి గ్రామానికి చేరుకుని బాలకృష్ణ చౌదరి యొక్క భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

November 28, 2025 / 12:15 PM IST

‘స్థానిక ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి’

KKD: ప్రత్తిపాడు టిడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సత్యప్రభ సమావేశం శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా పని చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతి కార్యకర్త తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని ఎమ్మెల్యే సూచించారు.

November 28, 2025 / 12:13 PM IST

పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి: ఎమ్మెల్యే

KDP: ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి శ్రీనివాసులును కిడ్నాప్ చేసి, దాడి చేసిన వసంత్ కుమార్ పై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రొద్దుటూరు MLA వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు. గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. తుపాకీ గురిపెట్టి, కాళ్లతో తన్ని, కొడుతున్నా DSP ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

November 28, 2025 / 12:12 PM IST

ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

SKLM: బూర్జ M కొల్లివలసకి చెందిన ఎన్ .మణికంఠ తన తల్లి భానుమతితో కలిసి స్కూటీ పై శ్రీకాకుళం వైపు వెళుతుండగా ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమదాలవలస ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో శ్రీకాకుళం వైపు నుంచి పాలకొండ వైపు వెళుతున్న లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో భానుమతి అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠకు తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 28, 2025 / 12:12 PM IST

విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ దుస్తులు పంపిణీ

AKP: ఎలమంచిలి పట్టణం కొత్తపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు హెచ్ఎం వైవీ రమణ, పీడీ కుందూరు రాజు స్కౌట్స్ అండ్ గైడ్స్ దుస్తులు శుక్రవారం అందజేస్తారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల నుంచి 32 మంది విద్యార్థులకు వీటిని అందజేసినట్లు తెలిపారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ సేవాబావం అలవడుతాయని అన్నారు.

November 28, 2025 / 12:10 PM IST

విద్యా శాఖ కమిషనర్‌కు పాలకొండలో ఘన స్వాగతం

PPM: ​రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. విజయరామరాజుకు పాలకొండలో ఘన స్వాగతం లభించింది. అధికారిక పర్యటన నిమిత్తం జిల్లాలోని పాలకొండ రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని ఆయన ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పుష్పగుచ్చాలు అందజేసి సాదర స్వాగతం పలికారు.

November 28, 2025 / 12:09 PM IST

నందికోట్కూరులో ఘనంగా పూలె 135వ వర్థంతి

NDL: నంది కోట్కూరు పట్టణంలో మహాత్మ జ్యోతి రావు పూలె 135వ వర్థంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్త జయ సూర్య శుక్రవారం పూలె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, సామాజిక ఉద్యమకారులు జ్యోతి రావు పూలె అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు.

November 28, 2025 / 12:08 PM IST

రాష్ట్ర స్థాయి పోటీలకు క్రిష్ణగిరి విద్యార్థి

KRNL: ఈనెల 29 నుంచి 30 వరకు అన్నమయ్య జిల్లా కలికిరిలో జరిగే రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్- 14 హ్యాండ్ బాల్ పోటీలకు కృష్ణగిరిలోని తొగర్చేడు ఉన్నత పాఠశాల విద్యార్థి మోహన్ ఎంపికయ్యారు. విద్యార్థిని HM రొక్కం రాఘవరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పీడీ శ్రీనివాసులు శిక్షణలో జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

November 28, 2025 / 12:06 PM IST