CTR: పలమనేరు పట్టణం పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో గురువారం మామిడి రైతుల సమావేశం నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంఘం ఉపాధ్యక్షులు ఉమాపతి నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిడి రైతుల సమస్యలు, మామిడికి గిట్టుబాటు ధర తదితర విషయాలపై చర్చిస్తామన్నారు. అనంతరం మండలాల వారీగా మామిడి రైతుల సంఘాల ఎన్నిక ఉంటుందని తెలిపారు.
CTR: పంచాయతీ కార్యదర్శుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చిత్తూరు జిల్లా పలమనేరు మండలం సముద్రపల్లి పంచాయతీ కార్యదర్శి సిరిపురం హరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు, రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సంఘ అభివృద్ధి, పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.
KDP: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కడపలో వైసీపీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని కడపకు చెందిన వైసీపీ నేతలు పేర్కొన్నారు. పులివెందుల పర్యటనలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కడపకు చెందిన సీనియర్ నాయకులు పాకా సురేష్, సునీల్ కుమార్, నిత్యానంద రెడ్డి, శ్రీరంజన్ రెడ్డి ఆయనను కలిశారు.
విశాఖ: విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గం హాట్ సీటుగా కనిపిస్తోంది. భవిష్యత్ విశాఖ అభివృద్ధికి దిక్సూచిగా ఈ ప్రాంతం నిలుస్తుండటంతో నేతల ఫోకస్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పటికే IT అభివృద్ధిలో మధురవాడ ప్రత్యేక స్ధానం సంపాదించింది. గూగుల్, సిఫీ డేటా సెంటర్లను ఇక్కడే ఏర్పాటు కానున్నాయి.
SKLM: కూటమి ప్రభుత్వ హయాంలో దేవాలయాల అభివృద్ధికి అడుగులు పడనున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నా నాయుడు చొరవతో టెక్కలి రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి క్షేత్రానికి రూ.3 కోట్లు, కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆలయానికి రూ.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈమేరకు దేవాదాయశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కృష్ణా: గుడివాడలో ఈవీఆర్ ఆసుపత్రిలో మహిళ గుండెకు సంబంధించిన ఎంజో గ్రామ్ టెస్టుల కోసం వెళితే మోకాళ్ళకి ఆపరేషన్ చేశామని బిల్లులు వేశారని నిన్న ఆవేదన వ్యక్తం చేసింది. రెండు కాళ్లు బాగానే ఉన్నాయని శాస్త్రా చికిత్స జరగలేదని వెల్లడించింది. ఉచిత మెడికల్ క్యాంపు అని చెప్పి, టెస్ట్ రిపోర్టులు అడిగితే వేల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపింది.
VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ లో పనిచేస్తూ రైలు ప్రమాదంలో మరణించిన బి. రామకోటి కుటుంబానికి ఎస్బీఐ సాలరీ ప్యాకేజీ ప్రయోజనంగా మంజూరు చేశారు. అయితే రూ. 1 కోటి చెక్కును ఆయన సతీమణి సీహెచ్. రామకు ఎస్బీఐ అధికారుల సమక్షంలో ఎస్పీ దామోదర్ బుధవారం అందజేశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. బంధువులకు, ఇతరులకు ఇవ్వకుండా పిల్లలు పెరుమీద ఫిక్సెడ్ డిపాజిట్ చేసుకోవాలని హితవు పలికారు.
కృష్ణా: గుడ్లవల్లేరులో గ్రామంలో శానిటరీ సిబ్బంది ద్వారా చెత్త తొలగింపు పనులను గురువారం చేపట్టారు. గ్రామం చుట్టూ వ్యర్థాల నిల్వ తగ్గించి, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బండి వారికి అందజేయాలని ఆయన గ్రామస్థులకు సూచించారు.
ప్రకాశం: రాచర్లలో నీటి సమస్యతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నెలలుగా పాత పోస్ట్ ఆఫీస్ బజారు, బీసీ కాలనీలో నీటి బోరులు చెడిపోయి ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి కిలోమీటర్ల మేర వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అధికారులకు పలుమార్లు సమస్యను తెలిపినా పట్టించుకోలేదని వాపోయారు.
GNTR: BJP నియామవళిని ప్రకారం పార్టీ కార్యక్రమాలు కాకుండా పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో మంగళగిరి బీజేపీ నాయకుడు మునగపాటి వెంకటేశ్వర్లు పాల్గొంటున్నార. దీంతో ఆయనను కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై మునగపాటి స్పందించాల్సి ఉంది.
ELR: ద్వారకాతిరుమల శ్రీవారి అంతరాలయ దర్శనం మరికొద్ది సేపట్లో పునః ప్రారంభం కానుంది. కరోనా కారణంగా ఐదేళ్ల క్రితం నిలిచిపోయిన ఈ దర్శనాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో వీటిని రద్దు చేస్తారు. అంతరాలయ దర్శనం టికెట్ ఒక్కొక్కరికి రూ. 500 లు కాగా.. రెండు లడ్డు ప్రసాదాలను అందిస్తామని ఆలయ ఈవో NVSN మూర్తి తెలిపారు.
సత్యసాయి: తలుపుల మండలం గరికపల్లికి చెందిన నాలుగేళ్ల కొమ్మెర హర్షవర్ధన్ అదృశ్యంపై ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు ప్రారంభించారు. నంబులపూలకుంట మండలంలోని గౌకనపేట అడవీ ప్రాంతంలో బాలుడి మృతదేహం గుర్తించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. హత్యపై పోలీసులు వేగంగా విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో A&D స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. సామాజికంగా వెనుకబడిన గిరిజనుల ఆర్థికాభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 500 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. గిరిజనుల వెనుకబాటుతనంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
W.G: ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల 13న ఎంఈవో-1కు అందజేసిన మెమోరాండంపై స్పందన లేకపోవడంతో, యూటీఎఫ్ (UTF) జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు ఆధ్వర్యంలో నిరసనకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 2న నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ముందస్తు నోటీసును బుధవారం డీఈవో నారాయణకు అందజేశారు. ఉండి, భీమవరం యూటీఎఫ్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
BPT: మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గురువారం బల్లికురవ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా చెన్నుపల్లిలో సాయంత్రం 3.30 గంటలకు, కొత్తపాలెంలో 4.30 గంటలకు, అంబడిపూడిలో 5.00 గంటలకు, కొత్త మల్లాయపాలెంలో 5.30 గంటలకు, సాయంత్రం 6.00 గంటలకు కొప్పెరపాలెం గ్రామల్లో పర్యటిస్తారని మంత్రి కార్యాలయం తెలిపింది.