• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

18న స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ క్రీడోత్సవాలు

సత్యసాయి: పుట్టపర్తిలోని పోలీసు పరేడ్ మైదానంలో బుధవారం స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ పోలీస్ క్రీడోత్సవాలు జరుగుతాయని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. బుధవారం ఉదయం 7:30 గంటలకు క్రీడోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలోని పోలీస్ శాఖలో వివిధ విభాగాలకు చెందిన పోలీసులు క్రీడోత్సవాల్లో పాల్గొంటారన్నారు.

December 17, 2024 / 07:59 PM IST

‘సైబర్ నేరాల పై ప్రజలను అప్రమత్తత చేయాలి’

SKLM: వార్షిక తనిఖీల్లో భాగంగా కోటబొమ్మలి పోలీస్ స్టేషను మంగళవారం విశాఖపట్నం DIG గోపీనాథ్ జట్టి, ఎస్పీ మహేశ్వర రెడ్డి కలసి తనిఖీలు నిర్వహించారు. DIG మహిళా పోలీసులతో మాట్లాడుతూ.. సైబర్ నేరాల పై ప్రజలను అప్రమత్తత చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలీస్ స్టేషను పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

December 17, 2024 / 07:57 PM IST

కరెంటు బిల్లులను దహనం చేసిన సీపీఎం నేతలు

ప్రకాశం: విద్యుత్ ట్రూఅప్ చార్జీల భారాలను రద్దు చేయాలని సీపీఎం నేతలు మంగళవారం ఒంగోలులోని 60 అడుగుల రోడ్డు జంక్షన్లో దహనం చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శివర్గ సభ్యులు జీ రమేష్ మాట్లాడుతూ.. ఈ నెల నుండి కొత్త ట్రూ అప్ చార్జీలు 17 వేల కోట్లు ప్రజలపై బిల్లుల రూపంలో భారాల మోపారన్నారు. ఈ బిల్లును చెల్లించలేమని ప్రజలు బిల్లును దహనం చేసి నిరసన తెలిపారు.

December 17, 2024 / 07:54 PM IST

అంత్యక్రియలలో పాల్గొన్న ఎమ్మెల్సీ

SKLM: టెక్కలి మండలం పాత నౌపాడ పంచాయతీ సర్పంచ్ దల్లి సంధ్య లోకేష్ రెడ్డి తల్లి మంగళవారం మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆమె అంత్యక్రియలో పాల్గొన్నారు. ఆమె ఆత్మ శాంతి చేకూరాలని కోరారు. ఆయనతో పాటు ఎంపీటీసీ సభ్యులు అప్పల రెడ్డి, వైసీపీ నాయకులు యోగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

December 17, 2024 / 07:50 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: MLA

NDL: ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద ఆరుగురు లబ్ధిదారులకు TDP నందికొట్కూరు ఇన్ ఛార్జ్ గౌరు వెంకటరెడ్డితో కలిసి పాణ్యం MLA గౌరు చరితా రెడ్డి రూ.4,56,355 చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు పాణ్యం నియోజకవర్గానికి CMRF పథకం కింద ప్రభుత్వం రూ.50,56,339 నిధులు విడుదల చేసినట్లు MLA తెలిపారు. దీంతో CM చంద్రబాబు, MLA గౌరు చరితాకు కృతజ్ఞతలు తెలిపారు.

December 17, 2024 / 07:47 PM IST

‘దుంపకుళ్ళు యాజమాన్య పద్ధతులు వివరించిన ఉద్యానవనాధికారి’

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని చెరుకుపల్లి జర్నీ వారి పల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం ఉదయం ఉద్యానవనాధికారి శ్వేత ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పసుపులో దుంపకుళ్ళు నివారణ చర్యలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు లక్ష్మీ మరియు రైతులు పాల్గొన్నారు.

December 17, 2024 / 07:43 PM IST

అధికారుల పని తీరుపై ఆరా తీసిన కలెక్టర్

W.G: వీరవాసరం మండలం కొణితివాడ గ్రామానికి చెందిన మహిళ రైతుతో జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారుల నుంచి అందుతున్న సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఆకాంక్షించారు. జిల్లాలోని ఏ రైస్ మిల్లుకైనా ధాన్యం తరలించుకోవచ్చునని మహిళా రైతుకు సూచించారు.

December 17, 2024 / 07:41 PM IST

తమిళనాడు మంత్రితో నెల్లూరు మంత్రులు భేటీ

NLR: తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి రాజేంద్రన్ నెల్లూరుకి విచ్చేశారు. ఆయన నగరంలోని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసానికి చేరుకున్నారు. మంత్రి రాజేంద్రన్‌కి మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎండీ ఫరూక్, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి పుష్పగుచ్చాలు అందజేశారు.

December 17, 2024 / 07:33 PM IST

‘అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదు’

ATP: గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణాలలో అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దన్నారు. నూతన లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా చెయ్యలన్నారు.

December 17, 2024 / 07:32 PM IST

పంటల బీమా ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్

పల్నాడు: జిల్లాలో పంటల బీమా ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం రబీ సీజన్ పంటల సాగుపై సమీక్ష నిర్వహించారు. వరికి రూ.630 చెల్లించి పంటల బీమా పథకంలో నమోదు కావాలని రైతులను చైతన్య వంతులను చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 6000 హెక్టార్లలో సాగు జరిగిందన్నారు.

December 17, 2024 / 07:25 PM IST

చిట్టమూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

TPT: గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని చిట్టమూరు పోలీస్ స్టేషన్‌ను మంగళవారం గూడూరు డీఎస్పీ వీవీ రమణ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లో క్రైమ్ రేట్ గురించి ఆరా తీశారు. పోలీసులు న్యాయం కోసం వచ్చే బాధితులతో ఫ్రెండ్లీ పోలీసులుగా ఉండాలని సూచించారు.

December 17, 2024 / 07:21 PM IST

‘రైతు ప్రయోజనాలే లక్ష్యంగా డీసీలు పనిచేయాలి’

ప్రకాశం: అద్దంకి నియోజకవర్గంలోని నాలుగు డిస్ట్రిబ్యూషన్ కమిటీలకు మంగళవారం ఎన్నిక జరుగగా.. ఏకగ్రీవంగా ఎన్నికైన ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్‌లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేకంగా అభినందించారు. రైతు ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేసే డీసీలు కాల్వకట్ట రక్షణ, బలోపేతం ద్వారా గత ఐదేళ్లుగా పూడిపోయిన పంట కాల్వలు పూడికతీత పనులు చేపట్టాలన్నారు.

December 17, 2024 / 07:17 PM IST

‘ఆరోగ్యశాఖ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

KDP: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేసీ బాదుల్లా తెలిపారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను విడుదల చేశారు.

December 17, 2024 / 07:15 PM IST

గల్ఫ్ బాధితురాలికి మంత్రి సుభాష్ అండ

కోనసీమ: గల్ఫ్‌లో పని చేస్తున్న సఖినేటిపల్లి మం.అంతర్వేది కరా గ్రామానికి చెందిన గంటా దీప్తిని వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించి, ఇండియాకు రప్పించి తన కుటుంబ సభ్యులకు అప్పగించి మంత్రి సుభాష్ మానవత్వం చాటుకున్నారు. బాధితురాలు గంటా దీప్తి, తన భర్త త్రిమూర్తు, కుటుంబ సభ్యులతో మంగళవారం సుభాష్‌ను రామచంద్రపురంలో మర్యాదపూర్వంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

December 17, 2024 / 07:12 PM IST

ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక చర్యలు

ELR:తుఫాన్ కారణంగా ఏలూరు జిల్లాలో స్వల్ప మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. జెసి ధాత్రి రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం రక్షణకు ఇప్పటికే 2 వేల టార్పాలిన్లు రైతులకు పంపిణీ చేశామన్నారు. మరో 500 టార్పాలిన్లు ముందస్తుగా సిద్ధం చేసినట్లు తెలిపారు.

December 17, 2024 / 07:07 PM IST