GNTR: మంగళగిరిలోని 6వ బెటాలియన్ APSPలో 2వ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. హోంమంత్రి అనిత అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం ప్రజా భద్రత కోసం శ్రమించే పోలీసులకు ఇలాంటి క్రీడలు అవసరమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో 6రాష్ట్రాల నుంచి మొత్తం 10 పోలీసు జట్లు పాల్గొంటున్నాయి.