ప్రకాశం: కంభం వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ తన ఇంటిలో రూ.20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన విషయం తెలిసిందే. అయితే కంభం మండలం తురిమెళ్ళ గ్రామానికి చెందిన ఎరువుల దుకాణదారుడు రవీంద్ర కుమార్ వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ కార్యాలయంలోను అధికారులు సోదాలు నిర్వహించారు.