KRNL: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సూచనల మేరకు జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని ఉప కార్మిక కమిషనర్ కె. వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈనెల 23 నుంచి మార్చి 24 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ASR: జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాలతో అరకు సర్కిల్ పరిదిలో శనివారం సీఐ హిమగిరి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్‌తో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అరకు రైల్వే స్టేషన్లు, అరకులోయ బస్ స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్‌తో అణువణువు తనిఖీలు చేపట్టారు. రైలు, బస్సులలో ప్రయాణికుల వద్ద వున్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
PPM: పార్వతీపురం పట్టణంలో బ్లూ పోలీస్ వాహనాన్ని ఏఎస్పీ మనీషా రెడ్డి గ్రీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల భద్రతే లక్ష్యంగా బ్లూ పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. క్రైమ్ నియంత్రణ, చైన్ స్నాచింగ్, దొంగతనాలు వంటి ఘటనలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
సత్యసాయి జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద 11,987 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు మంజూరైనట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. శనివారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే అర్హులైన పేదలకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ATP: అనంతపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో శనివారం బాల్య వివాహాల నిర్మూలన చైతన్య రథాన్ని ఆర్డీవో కేశవ నాయుడు ప్రారంభించారు. రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఏలూరు సీపీఐ కార్యాలయంలో శనివారం రెడ్ బుక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ఆలోచన కలిగించేలా సమాజంలో దోపిడీ పీడన నుంచి విముక్తి కలిగించేందుకు ఆలోచన కలిగించే గొప్ప పుస్తకాలు రెడ్ బుక్స్ అని కొనియాడారు. ప్రజల మధ్య అంతరాలు లేని గొప్ప సమాజాన్ని నిర్మించాలన్నారు.
W.G: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మార్చి 2న విజయవాడలో సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే రాజా రామ్మోహన్ రాయ్ అన్నారు. జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం భీమవరం సీఐటీయూ కార్యాలయంలో జరిగింది.
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక శ్రీ రంగనాథ స్వామి ఆలయ సమీపంలో శనివారం సాయంత్రం కారును కెమికల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జెంది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ సీఐ హాజీవల్లి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
VZM: చెత్త రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో రామకృష్ణ రాజు వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛదివాస్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొండవెలగాడలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి ప్రజలు సహకారం అవసరమన్నారు. పరిశుభ్రతతోనే రోగాలకు దూరంగా ఉండొచ్చని చెప్పారు.
SKLM: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల సభ్యత్వ నమోదు సమన్వయకర్తల పేర్లను శనివారం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి సుడా ఛైర్మన్ కోరికన రవి కుమార్‌ను సభ్యత్వ నమోదు సమన్వయకర్తగా నియమించింది. జిల్లాలో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో జనసేన పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేస్తామన్నారు.
SKLM: శ్రీకాకుళం నుంచి పాలకొండకు వెళ్తున్న బస్సులో శనివారం సాయంత్రం ఓ ప్రయాణికుడు గుండెపోటుతో రావడంతో చింతాడ వద్ద బస్సును నిలుపుదల చేసి 108కి చెప్పండి సమాచారమిచ్చారు. దీంతో 108 చేరుకుని బస్సులో ఉన్న ప్రయాణికుని 108లోకి ఎక్కించే సమయంలో ప్రయాణికుడు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది .
VSP: వాల్తేరు రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా శనివారం డీజిల్ లోకో షెడ్‌ను పరిశీలించారు. కొనసాగుతున్న కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక మార్పుల పురోగతిని సమీక్షించారు. సిమెన్స్ సంస్థ ద్వారా 300 లోకోమోటివ్‌ల నిర్వహణ కోసం చేపట్టిన ప్రాజెక్ట్ పురోగతిపై ప్రత్యేకంగా చర్చించారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా శాఖల వారీగా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితులు, పెండింగ్ పనులపై ఎంపీడీవో ఇమ్రాన్ సమీక్షించారు. ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు సేవలను సమర్థవంతంగా అందించాలని అధికారులకు సూచించారు.
ASR: పచ్చదనం, పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాను క్లీన్ ఆర్గానిక్ జిల్లాగా ఉంచడమే ప్రధాన ద్యేయమన్నారు. “జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్’ నినాదంతో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర శనివారం పాడేరు మండలం తుంపాడ జీపీయూ స్కూల్లో నిర్వహించారు. వీధులలో, రోడ్లకు ఇరువైపు పరిశీలించి చుట్టుపక్కల వ్యర్ధాలు లేకుండా చూడాలన్నారు.