• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘జీడి మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలి’

శ్రీకాకుళం జిల్లాలో రైతులు పండిస్తున్న మొక్కజొన్న, జీడి పంటలకు ప్రభుత్వం మద్దతుధర కల్పించి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. మోహన్ రావు అన్నారు. సోమవారం జిల్లాపరిషత్ సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదు నమోదు మరియు పరిష్కార వేదికకు దరఖాస్తు సమర్పించారు. 80 కేజీల జీడిపిక్కలు బస్తాకు 16వేలు మద్దతుధర ఇవ్వాలన్నారు.

April 20, 2026 / 01:02 PM IST

పసివేదలలో వైభవంగా గోగులమ్మ తల్లి జాతర

తూ.గో: కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో వెలసి ఉన్న గ్రామదేవత గోగులమ్మ తల్లి జాతర ఉత్సవాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో కలిసి పూజలు జరిపారు. సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుతూ జరుపుకుంటున్న ఈ ఉత్సవాలు మన వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు.

April 20, 2026 / 01:01 PM IST

కోనసీమ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా RS కుమార్

కోనసీమ: జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఆర్ఎస్ కుమార్ ఈశ్వరన్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది అభినందనలు తెలిపారు. జిల్లాలో మద్యం అక్రమ విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలన్నారు. నిబంధనలు విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 20, 2026 / 01:01 PM IST

జగ్గంపేట డిప్యూటీ MPDO గుండెపోటుతో మృతి

KKD: జగ్గంపేట డిప్యూటీ ఎంపీడీవో VVVSN మూర్తి సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. రాజానగరంలోని తన స్వగృహం వద్ద ఉండగా ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. సీనియర్ అసిస్టెంట్‌గా జగ్గంపేట వచ్చిన ఆయన, పదోన్నతి పొంది డిప్యూటీ ఎంపీడీవోగా సేవలందిస్తున్నారు. ఆయన మృతి పట్ల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.

April 20, 2026 / 01:01 PM IST

పిచ్చాటూరులో సీసీ రోడ్డు ప్రారంభం

తప్త: పిచ్చాటూరులో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. రైతులకు భరోసా పథకాలు, పెన్షన్ పెంపుతో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు.

April 20, 2026 / 12:54 PM IST

ప్రజా సమస్యలు వింటున్న కలెక్టర్..!

PLD: నరసరావుపేట కలెక్టరేట్‌లోని PGRS హల్ నందు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిస్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను కలెక్టర్ కృతిక శుక్లా స్వీకరించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

April 20, 2026 / 12:49 PM IST

నీటి సంరక్షణపై జడ్పీ హైస్కూల్ విద్యార్థుల ప్రదర్శన

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం జల సంరక్షణపై ప్రదర్శన నిర్వహించారు. చోడవరం రోడ్డులో పాఠశాల విద్యార్థులు నిర్వహించిన జల సంరక్షణ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. నీటిని వృధా చేయరాదనీ, నీటిని పొదుపు చేయాలని, ఇంకుడుగుంటల ద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టాలని విద్యార్థులు నినాదాలు చేశారు. హెచ్ఎం రవి పాల్గొన్నారు.

April 20, 2026 / 12:40 PM IST

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

CTR: ఐరాల మండలం పొలకల సంత గేటు వద్ద ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు జన్మదినం పురస్కరించుకుని ఎమ్మెల్యే మురళీమోహన్ సోమవారం ఆవిష్కరించారు. టీడీపీ నాయకులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఘనత సీఎంకు దక్కిందని ఆయన వెల్లడించారు. ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

April 20, 2026 / 12:35 PM IST

సమాజానికి సమానత్వం, సేవా భావం అవసరం

VZM: విజయనగరం కలెక్టరేట్‌లో నిర్వహించిన మహాత్మ బసవేశ్వర జయంతి కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవేశ్వరుని చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా JC మాట్లాడుతూ.. మహానుభావుడు బసవేశ్వరుడు సమాజంలో సమానత్వం, న్యాయం, సేవా భావం వంటి విలువలను ప్రతిష్ఠించారని అన్నారు.

April 20, 2026 / 12:34 PM IST

పొన్నలూరులో కేక్ కట్ చేసిన మంత్రి

ప్రకాశం: పొన్నలూరులో సోమవారం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

April 20, 2026 / 12:33 PM IST

కలెక్టరేట్‌లో బసవేశ్వర జయంతి వేడుకలు

ATP: అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం బసవేశ్వర 893వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ స్వప్న పాల్గొని బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులమత రహిత సమాజం కోసం బసవేశ్వరుడు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

April 20, 2026 / 12:32 PM IST

సత్యవేడులో పేట్రేగిపోతున్న గ్రావెల్ మాఫియా.?

TPT: సత్యవేడు మండలంలో గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతూ టిప్పర్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. మదనంజేరి గ్రామంలో సర్వేనంబర్ 186/3 లో 5-00 ఎకరాల మేత బీడు భూముల్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలే ఇందుకు సాక్ష్యం అంటున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

April 20, 2026 / 12:30 PM IST

చంద్రబాబు దూరదృష్టి స్ఫూర్తిదాయకం: టీజీ

KRNL: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చూపుతున్న దూరదృష్టి నాయకత్వం ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, మరింత ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఓ పాత ఫోటోను పంచుకున్నారు.

April 20, 2026 / 12:30 PM IST

రూ.76 కోట్ల అభివృద్ధి పనులు: MLA దగ్గుపాటి ప్రసాద్

ATP: CM చంద్రబాబు 76వ జన్మదినం వేళ అనంతపురంలోలో రూ.76 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు MLA దగ్గుపాటి ప్రసాద్ ప్రకటించారు. సీఎం 76 ఏళ్ల వయసులోనూ 20 గంటల పాటు శ్రమిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు షరీఫ్ పాల్గొన్నారు.

April 20, 2026 / 12:28 PM IST

‘మాదకద్రవ్యాలపై కాకుండా విద్యపై దృష్టి సారించాలి’

PPM: విద్యార్దులు మాదకద్రవ్యాల వైపు మొగ్గు చూపకుండా విద్యపైనే దృష్టి సారించాలని పాలకొండ DSP రాంబాబు సూచించారు. సోమవారం మాదక ద్రవ్యాల నివారణపై పాలకొండలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు స్టేషన్‌ నుంచి ర్యాలీగా వెళ్లి RTC కాంప్లెక్స్‌ వద్ద మానవ హారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు వదిలితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.

April 20, 2026 / 12:27 PM IST