KKD: జగ్గంపేట డిప్యూటీ ఎంపీడీవో VVVSN మూర్తి సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. రాజానగరంలోని తన స్వగృహం వద్ద ఉండగా ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. సీనియర్ అసిస్టెంట్‌గా జగ్గంపేట వచ్చిన ఆయన, పదోన్నతి పొంది డిప్యూటీ ఎంపీడీవోగా సేవలందిస్తున్నారు. ఆయన మృతి పట్ల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.