VZM: విజయనగరం కలెక్టరేట్లో నిర్వహించిన మహాత్మ బసవేశ్వర జయంతి కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవేశ్వరుని చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా JC మాట్లాడుతూ.. మహానుభావుడు బసవేశ్వరుడు సమాజంలో సమానత్వం, న్యాయం, సేవా భావం వంటి విలువలను ప్రతిష్ఠించారని అన్నారు.