• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘శతశాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలి’

AKP: పంచాయితీ సిబ్బంది శత శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని నర్సీపట్నం డీఎల్డీవో నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం పాయకరావుపేట పట్టణంలో సిబ్బంది అధికారులతో కలిసి పలు షాపుల వద్దకు వెళ్లి ఇంటి పన్నులు వసూళ్లు చేశారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో 12 మండలాల్లో వివిధ పన్నుల రూపంలో రూ.17 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 58% వసూళ్లు చేశామన్నారు.

February 26, 2026 / 07:45 PM IST

ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్

మార్కాపురం రెవెన్యూ డివిజన్ (ఆర్డీవో)గా పెంచల ప్రభాకర్ గురువారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా నూతన ఆర్డీవో ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవిన్యూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు..

February 26, 2026 / 07:44 PM IST

‘ఆరోగ్య సేవలపై ప్రజా అభిప్రాయం మెరుగుపడాలి’

నంద్యాల జిల్లాలో వైద్య శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై సానుకూల అభిప్రాయం పెరగాలంటే సేవల నాణ్యతను మెరుగుపరచాలని కలెక్టర్ జీ. రాజకుమారి వైద్యాధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి సమయానికి, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

February 26, 2026 / 07:43 PM IST

ప్రజా ప్రతినిధులను ప్రోత్సహించిన ఎంపీ

NTR: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఏపీ స్టేట్ టెలిస్టులేటివ్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపీ కేశినేని చిన్ని ఈరోజు హాజరై క్రీడలు ఆడుతున్న ప్రజా ప్రతినిధులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలతో క్రికెట్ పోటీలు నిర్వహించాలనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆలోచన రాబోయే కాలంలో లెజిస్లేటివ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు పునాది కావాలని ఆకాంక్షించారు.

February 26, 2026 / 07:42 PM IST

కలెక్టర్‌ను కలిసిన కేఎంసీ కమిషనర్

KDP: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం కడప నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సీ.)గా బాధ్యతలు స్వీకరించిన రాకేష్ చంద్రం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. నగర అభివృద్ధి, పారిశుధ్యం, పౌర సేవలపై పరస్పరం చర్చించినట్లు తెలిసింది.

February 26, 2026 / 07:42 PM IST

మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

W.G: మండల కేంద్రం అయిన ఉండి హైస్కూల్లో క్లినికల్ సైకాలిజిస్ట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడికి గురికాకుండ చూసుకోవాలని కోరారు. మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైక్రియాట్రిక్, సోషల్ వర్కర్ సుమన్ బాబు మాట్లాడుతూ.. 11416 టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయొచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. సునంద, కృష్ణ కుమార్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 07:37 PM IST

ఇంగ్లీష్ పరీక్షకు 11,549 మంది విద్యార్థులు హాజరు

కోనసీమ: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. 40 కేంద్రాల్లో ఇంగ్లీష్ సెట్-2 ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించారు. మొత్తం 11,885 మందికి గాను 11,549 మంది హాజరయ్యారని, 336 మంది గైర్హాజరైనట్లు DIEO చంద్రశేఖర్ బాబు తెలిపారు. 97% మంది పరీక్ష రాశారని, జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు.

February 26, 2026 / 07:36 PM IST

‘స్వర్ణాంధ్ర లక్ష్యాల ప్రచారం వేగవంతం చేయాలి’

VSP: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం “స్వర్ణాంధ్ర- 2047” లక్ష్యాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

February 26, 2026 / 07:32 PM IST

బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: జిల్లాలోని MJP గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు జిల్లా కన్వీనర్ జమునా బాయి దరఖాస్తులను ఆహ్వానించారు. 5వ తరగతితో పాటు 6, 7, 8 తరగతులు, జూనియర్ ఇంటర్‌లో ప్రవేశానికి ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పాఠశాలల్లో 840, ఇంటర్‌లో 680 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల విద్యార్థులు మార్చి 4లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 26, 2026 / 07:32 PM IST

ఎంపీని కలిసిన నేతలు

ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్‌ను గురువారం వేలేరుపాడు, కుకునూరు మండలాల నేతలు కలిశారు. మండలాల అభివృద్ధి, పోలవరం నిర్వాసితుల కష్టాలపై ఎంపీకి వినతి పత్రం సమర్పించారు. ముంపు లేని ప్రాంతాలలో వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, మండలాల్లో ఎక్కడా మంచినీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

February 26, 2026 / 07:31 PM IST

దారుణ హత్యకు గురైన వాంబే కాలనీ వాసి

శ్రీ‌కాకుళం న‌గ‌రం వాంబేకాల‌నీకి చెందిన పైల మోహ‌న‌రావు (48) దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఎచ్చెర్ల మండ‌లం పొన్నా వంతెన స‌మీపంలో గురువారం సాయంత్రం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు టిఫిన్‌, కిరాణా షాపుల‌ను న‌డుపుతూ జీవ‌నం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యుల సంఘటన స్థ‌లానికి చేరుకుని క‌న...

February 26, 2026 / 07:28 PM IST

ఎస్సీ కాలనీలో భూ ఆక్రమణపై ఉద్రిక్తత

KRNL: చిలకలడోనలోని ఎస్సీ కాలనీలో 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఇవాళ కాలనీవాసులు జిల్లా అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. భూమిని సర్వే చేసి పేదలకు పంచిపెట్టడంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ స్థలాన్ని పరిశీలించగా కొంత ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూమిపై సర్వే చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

February 26, 2026 / 07:25 PM IST

మండపేటలో పాలకేంద్రాలపై విస్తృత తనిఖీలు

E.G: మండపేట పురపాలక సంఘ కమిషనర్ టి.వి.రంగారావు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఆధ్వర్యంలో శానిటేషన్ సెక్రటరీలు మండపేటలోని పాల కేంద్రాలను తనిఖీ చేశారు. మండపేట పట్టణ పరిధిలో ఉన్న 16 పాలకేంద్రాలలో గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. పాల ఉత్పత్తులు నాణ్యత పరిశీలించి, ఏ విధమైన పాల ఉత్పత్తులు నిల్వ ఉంచరాదని పేర్కొన్నారు.

February 26, 2026 / 07:24 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు’

ASR: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం తగదని టీడీపీ అరకు ఇన్‌ఛార్జ్, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సియ్యారి దొన్ను దొర హెచ్చరించారు. ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి నేతలు స్వప్రయోజనాలకు కాకుండా ప్రజల పక్షాన అధికారుల వద్దకు వస్తారని స్పష్టం చేశారు. వారి సమస్యల పట్ల అలసత్వం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

February 26, 2026 / 07:21 PM IST

స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ

తూ.గో: ఢిల్లీలో జరిగిన కార్మిక, జౌళీ మరియు నైపుణ్యాభివృద్ధి పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, జౌళీ మంత్రిత్వ శాఖ, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లను కమిటీ పరిశీలించినట్లు తెలిపారు.

February 26, 2026 / 07:17 PM IST