VZM: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించారు. ఈ జరిమానాలను అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ MSHR తేజ చక్రవర్తి విధించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.
సత్యసాయి: సోమందేపల్లిలోని వినాయక నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు ఖలీల్ మద్యం మత్తులో గురువారం మృతి చెందారు. ఖలీల్ అధికంగా మద్యం సేవించి బ్రాందీ షాపు వద్ద అపస్మారక స్థితిలో పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబం పూర్తిగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
ATP: గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో భూ తగాదా విషయంలో గురువారం బసీనేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు నూర్ భాషాపై వైసీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో నూర్ భాషాకు గాయాలయ్యాయి. గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
VSP: ప్రముఖ పర్యాటక కేంద్రం రుషికొండ బీచ్‌లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగిన ఓ పర్యాటకుడు అలల ఉద్ధృతికి లోనై నీటిలో మునిగి మృతి చెందారు. మృతుడు ఏ ప్రాంతానికి చెందినవారో సహా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
CTR: వికలాంగులకు, వృద్ధులకు నిత్యవసర వస్తువులను ఇంటి వద్దే అందించాలని పెద్దపంజాణి తహసీల్దార్ రామ్మూర్తి డీలర్లును ఆదేశించారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటించి ప్రతినెల 1వ తేదీ నుంచి రేషన్ షాప్‌కి వచ్చిన వస్తువులను పంపిణీ చేయాలని అన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెంట్రల్ కమిటీ ఛైర్మన్ మానవత(ఆలపాటి) నాగేశ్వరరావు సంస్మరణ సభ గురువారం ఏలూరులోని లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఉండి మానవత సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, ట్రెజరర్ కేటీన్ సత్యనారాయణ, మండల ఛైర్మెన్ రుద్రరాజు యువరాజు, కో ఛైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావులు పాల్గొని పుష్పంజలి ఘటించారు.
VZM: జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఫిబ్రవరి 28న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు 1 నుండి 7వ స్థాయి సంఘాల సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశాలకు సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు అందరూ హాజరై అభివృద్ధి పనులపై చర్చించాలని కోరారు.
TPT: నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం తెలిపారు. వరదయ్యపాలెంలో సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలును పరిశీలించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించామని చెప్పారు.
కోనసీమ: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటులు అన్నపూర్ణ, రజిత గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. వారికి అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించిన వారు ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపారు. వీరి రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
CTR: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గంగవరంలో గురువారం పర్యటించారు. పలువురు పార్టీ నాయకులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ కార్యకలాపాలపై వారికి ఆయన దిశా నిర్దేశం చేశారు. పెద్దిరెడ్డిని కలిసిన వారిలో జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేష్ గౌడ, సునీల్ కుమార్, మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులు ఉన్నారు.
శ్రీకాకుళం వాంబే కాలనీకి చెందిన పైల మోహన్ రావు (40) పొన్నాడ వంతెన సమీపంలో గురువారం శవమై కనిపించారు. గత రెండు రోజులుగా ఆచూకీ లేని మోహన్ రావు కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుని తలపై తీవ్ర గాయాలు ఉండటంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని దర్శి మోటార్ వాహనాల తనిఖీ అధికారి రవికుమార్ హెచ్చరించారు. గురువారం పామూరులో నిర్వహించిన తనిఖీల్లో టాక్స్ చెల్లించని ఒక స్కూల్ బస్సు, రెండు టిప్పర్లకు మొత్తం రూ.1.55 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. రవాణా వాహనాలు విధిగా ట్యాక్స్ చెల్లించి, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
KNRL: వెల్దుర్తి(మం) రామళ్లకోట గ్రామానికి చెందిన 63 ఏళ్ల కూలీ బోయ నాగయ్య ఎడమ కాలికి గాయమై సెప్టిక్ కావడంతో పిక్కల వరకు తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం వికలాంగుడిగా మారి ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ అధ్యక్షుడు హరి సింహనాయుడు ఇవాళ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట చెక్‌పోస్ట్ వద్ద సీఐ హరిబాబు ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా, పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించి పెండింగ్ చలానాలు చెల్లించాలని హెచ్చరించారు. అక్రమ రవాణా నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మద్యం సేవించి వాహనం నడిపితే భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు.
PPM: సీతానగరం మండలం కృష్ణరాయపురం గ్రామ మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడును మాజీ ఎమ్మెల్యే జోగారావు గురువారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్య కారణంతో విశాఖపట్నంలో చికిత్స పొంది స్వగ్రామానికి విచ్చేసిన ఆయనను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.