SKLM: పదవ తరగతి పరీక్షలు దగ్గర అవుతున్న సందర్భంగా తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని హెచ్ఎం ఒకలా రత్నమాల తెలిపారు. నరసన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఇంటి వద్ద చదువుతోపాటు వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలన్నారు.
CTR: చౌడేపల్లి మండలంలో ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా రూ.20.70లక్షల విలువ గల నిషేధిత ‘కూల్ లిప్’ పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య ఎస్పీ ధీరజ్ తెలిపారు. మత్తు పదార్థాల సరఫరా వెనక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించడంలో ఇది కీలక ముందడుగు అన్నారు.
W.G. ఆకివీడు తాళ్లకోడు కాలనీలో సమస్యలను పరిశీలించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర ప్రారంభించారు. కాలనీలో రోడ్లు సక్రమంగా లేవని, తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ లేదని కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలనీని ఆకివీడు నగర పంచాయతీలో చేర్చ అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
SKLM: మందస మండలం పల్లిబహడపల్లిలో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ఆహ్వానం మేరకు మాజీ మంత్రి అప్పలరాజు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వజ్రపు కొత్తూరు మండలం నువ్వులరేవులో అమ్మవారిని దర్శించుకున్నారు.
తూ.గో: రాజానగరం మండలంలో 12 ఏళ్ల బాలికపై 44 ఏళ్ల కాళీకృష్ణ అత్యాచారయత్నం చేశాడని ఎస్ఐ మురళికృష్ణ గురువారం తెలిపారు. అనారోగ్యం వల్ల స్కూల్‌కు వెళ్లని బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని వెల్లడించారు. కూలి పని నుంచి వచ్చిన తల్లి, స్థానికులు బాలిక అరుపులు విని రావడంతో నిందితుడు పరారయ్యాడన్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఏలూరు పార్లమెంటు పరిధిలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. గురువారం ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసి, ప్రజాదర్బార్ నిర్వహించారు. 53 మంది లబ్ధిదారులకు 41,40,368 విలువైన CMRF చెక్కులు అందించారు. విద్యార్ధుల భవిష్యత్తు కోసం AI ల్యాబులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
NTR: విజయవాడ మాచవరం పోలీసులు డ్రగ్స్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాలు ప్రకారం.. రాజేష్ అనే వ్యక్తి మరో ఇరువురుతో కలిసి డ్రగ్స్ కలిగి ఉన్నాడని, ఈ నేపథ్యంలో అతనిని డిసెంబర్ నెలలో అరెస్ట్ చేశారు. కాగా, రాజేష్ తప్పించుకుని పరారయ్యారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
W.G. ఆచంట మండలం కొడమంచిలి బీపీ చెరువులో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం స్లాబ్ పనులు మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు ఆధ్వర్యంలో సరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ.. అధికారం ఉన్న లేకపోయినా ఇచ్చిన మాట తప్పకుండ బీపీ చెర్వులో అంబెద్కర్ స్లాబ్ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.
ATP: అనంతపురానికి పట్టిన శని విడిపోతోందని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్, పద్మశాలి కార్పొరేషన్ పోతుల లక్ష్మీనరసింహులు అన్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు ప్రెస్ మీట్ నిర్వహించారు. మేయర్ సానుభూతి రాజకీయాలకు తెర లేపారన్నారు. అవినీతి ఎక్కడుందో నిరూపించాలని సవాల్ చేశారు.
KDP: బద్వేల్ నియోజకవర్గం కలసపాడు(మం) పెళ్లి మర్రి చెక్ డాం సమీపంలో గురువారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. కలసపాడు నుంచి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలవడంతో అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తూ.గో: నల్లజర్ల మండలంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఇవి పనిచేయడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కేంద్రాలను వెంటనే వినియోగంలోకి తెచ్చి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని గ్రామస్థులు కోరుతున్నారు.
CTR: పాలసముద్రం జడ్పీ హైస్కూల్ విద్యార్థుల అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి, పాల్గొని “ధైర్య స్పర్శ” పోస్టర్‌ను ట్రైనీ ఐపీఎస్ తరుణ్ పహ్వాతో కలిసి ప్రారంభించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
KRNL: గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని డిప్యూటీ ఎంపీడీవో జయరాముడు అన్నారు. గురువారం పెద్దకడబూరులో పన్నుల వసూళ్లపై ఆయన అవగాహన కల్పించారు. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు సకాలంలో చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. పన్నులు సమయానికి చెల్లిస్తే గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు.
BPT: వయోజన విద్యా కార్యక్రమాలను వేగవంతం చేసి ‘అక్షరాంధ్ర’ లక్ష్యాలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం వయోజన విద్యా కార్యక్రమాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. మార్చి 4న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సత్యసాయి: హిందూపురంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు చట్టం 1861 సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మత, రాజకీయాలకు అతీతంగా సోషల్ మీడియా పోస్టులు చేసే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.