నంద్యాల జిల్లాలో వైద్య శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై సానుకూల అభిప్రాయం పెరగాలంటే సేవల నాణ్యతను మెరుగుపరచాలని కలెక్టర్ జీ. రాజకుమారి వైద్యాధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి సమయానికి, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.