ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్‌ను గురువారం వేలేరుపాడు, కుకునూరు మండలాల నేతలు కలిశారు. మండలాల అభివృద్ధి, పోలవరం నిర్వాసితుల కష్టాలపై ఎంపీకి వినతి పత్రం సమర్పించారు. ముంపు లేని ప్రాంతాలలో వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, మండలాల్లో ఎక్కడా మంచినీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.