CTR: వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళాన్ని శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబ సభ్యులు అందజేశారు. మైనగుండ్లపల్లి, తవణంపల్లి మండలం వాస్తవ్యులైన దాతలకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రవి పాల్గొన్నారు.
కృష్ణా: గన్నవరం మండలం బూతుమిల్లిపాడులో రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బుధవారం ప్రారంభించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, సలహాలు ఒకేచోట అందించడమే లక్ష్యమన్నారు. రూ.3 లక్షల విరాళం ఇచ్చిన ముక్కాముల సుబ్బారావును ప్రశంసించారు. గ్రామ అభివృద్ధి పనులు త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు.
W.G: ఆకివీడులో గ్యాస్ కొరత కారణంగా చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పానీపూరి, బజ్జీల బండ్ల నిర్వాహకులు గత్యంతరం లేక గృహ అవసరాల సిలిండర్లను అధిక ధరకు కొనుగోలు చేస్తూ వ్యాపారాలు సాగిస్తున్నారు. పెట్టుబడి పెరగడంతో చిరుతిండ్ల ధరలను పెంచక తప్పడం లేదని, కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
NDL: అవుకు మండలం సంగపట్నం గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం (CDE) పీజీ కోర్సుల ప్రవేశ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించింది. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి anucde.info వెబ్‌సైట్‌లో ఫారం లింక్ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు దరఖాస్తు చేయని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని CDE డైరెక్టర్ సూచించారు.
PPM: జిల్లాలో భారత్ గ్యాస్ వినియోగదారుల బాధలు చూడాలని కాంగ్రెస్ పార్టీ DCC జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు కోరారు. ఆయన బుధవారం డిప్యూటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో భారత్ గ్యాస్ సక్రమంగా సరఫరా జరగటం లేదని వినియోగదారులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. నెలరోజులుగా వినియోగదారులకు భారత్ గ్యాస్ పంపిణీ జరగలేదన్నారు.
GNTR: గుంటూరు పట్టణంలోని బ్రాడీపేట శారదా నికేతన్ కళాశాలలో గుళ్లపల్లి సుబ్బారావు సంస్థ రూ.25 లక్షలతో తరగతి గది, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. వీటిని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ప్రారంభించారు. సుదీర్ఘకాలంగా సంస్థ చేస్తున్న సేవలను ఆమె కొనియాడారు. సీఎం పీ4 విధానంతో విద్యావ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు.
KDP: ప్రొద్దుటూరులోని 27వ వార్డులో బుధవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 14,313 మంది లబ్ధిదారులకు రూ. 6,20,64,500లు NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లి సమీపంలోని కలిచెర్ల గ్రామంలో జలజీవన్ మిషన్ కింద నిర్మాణంలో ఉన్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. రూ.2370 కోట్ల వ్యయంతో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా గండికోట రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని పీలేరు, రాయచోటి ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
CTR: పుంగనూరు మండలంలోని ప్రసన్నయ్యగారిపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతాసమేత కోదండరామస్వామి ఆలయ ప్రారంభపూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. తర్వాత ఆలయంలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
SKLM: ఎచ్చెర్ల మండల సర్పంచ్‌లకు అభినందన కార్యక్రమాన్ని ఎంపీపీ చిరంజీవి బుధవారం ఏర్పాటు చేశారు. కరోనా లాంటి విపత్కర సమయంలో విశేష సేవలందించిన మిమ్మల్ని చరిత్ర మర్చిపోలేదన్నారు. తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి ప్రజా మన్ననలు పొందడం అభినందించదగిన విషయం అని కొనియాడారు. అనంతరం సర్పంచులను సత్కరించారు.
విశాఖ జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న జనాభా, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా స్థానిక ఎన్నికలు ఇకపై 120 వార్డుల ఆధారంగా నిర్వహించబడతాయి.
AKP: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత భూముల తాజా పరిస్థితిని తెలియజేస్తూ నివేదికలను సమర్పించాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రీ సర్వే తదితర అంశాలపై విధివిధానాలను వివరించారు
VZM: నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామంలో సుమారు రూ 80 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ ఛైర్మన్, పీఏసీఎస్ అధ్యక్షుడు, సర్పంచ్ మాకేన నవీన్ పాల్గొన్నారు.
NTR: నందిగామలో వార్డుల సంఖ్యను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ జనాభా పెరుగుదల, అభివృద్ధి అవసరాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 28 వార్డులను 32కు పెంచుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. వార్డుల సంఖ్య పెరగడం ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందని అధికారులు అన్నారు.