• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కోడుమూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు

KRNL: కోడుమూరు పట్టణంలో అరుణోదయ బుక్ సెంటర్ సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

March 30, 2026 / 08:22 AM IST

సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

ASR: కొయ్యూరు మండలం బాలారం పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ అప్పలనర్స కోరారు. ఆదివారం మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు. బాలారం నుంచి రాజవొమ్మంగి వరకు రెండు జిల్లాలను కలుపుతూ రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. వైసీపీ నేతల కబ్జాలో ఉన్న కంఠారం పీహెచ్‌సీ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు.

March 30, 2026 / 08:20 AM IST

యాగంటి, నందవరంలో ద్వాదశి పూజలు

NDL: బనగానపల్లె సమీపంలోని యాగంటి ఉమామహేశ్వరస్వామి, నందవరం చౌడేశ్వరి మాత ఆలయాల్లో సోమవారం ద్వాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. వేదపండితులు శాస్త్రోక్తంగా కుంకుమార్చన, రుద్రాభిషేకం, మహామంగళహారతి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారి సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

March 30, 2026 / 08:18 AM IST

కావలిలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ దుర్మరణం

NLR: కావలి రూరల్ వెంకయ్య గారిపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ కోరికల అంకయ్య (53) దుర్మరణం చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ కునుకు తీయడంతో లారీ కల్వర్టులో పడిపోయింది. లారీ పూర్తిగా ద్వంసం అయ్యింది. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తిరుమల్ రెడ్డి తెలిపారు. 

March 30, 2026 / 08:16 AM IST

కనకదుర్గమ్మకు వెండి కిరీటం బహుకరణ

E.G: గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గంగాభవాని కాలనీలోని శ్రీ కనకదుర్గ దేవికి భక్తులు తిరుపతి రాము, సీతా దంపతులు రూ.1.60 లక్షల విలువైన వెండి కిరీటం సమర్పించారు. ఆదివారం అమ్మవారి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కిరీటాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో సేవలు అందించారు.

March 30, 2026 / 08:15 AM IST

‘జాబ్ క్యాలెండర్‌ ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది’

VZM: ఏపీ చరిత్రలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత CM చంద్రబాబుకే చెందుతుందని ప్రబుత్వ విప్, MLC డా.వేపాడ చిరంజీవి అన్నారు. ఆదివారం స్దానిక గురజాడ కళాభారతి ఆడిటోరియంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్‌‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు .ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..CM చంద్రబాబు, IT శాఖ మంత్రి నారా లోకేష్ కృషి వాళ్ళనే లక్షలాది నిరుద్యగుల కల నెరవేరిందన్నారు.

March 30, 2026 / 08:10 AM IST

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు..!

TPT: జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత ప్రభుత్వంలో అనేక నిబంధనలు చూపి తొలగించిన వాటితో పాటు కొత్తవి ఎప్పుడిస్తారా? అని అర్హత కలిగిన వారు చూస్తున్నారు. జనవరి నుంచి ఆప్పుడు ఇప్పుడు అంటున్నారు తప్ప, ఎక్కడా అమలు కావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, నేడు CM చంద్రబాబు జిల్లాకు రానున్న నేపథ్యంలో ఏదైనా హమీ ఇస్తారా అన్న ఆశలు ప్రజల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 

March 30, 2026 / 08:09 AM IST

‘జిల్లా ప్రజలు ఈ నెంబర్‌ను సేవ చేసుకొండి’

VSP: APEPDCL పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 30, 2026 / 08:07 AM IST

‘జిల్లా ప్రజలు ఈ నెంబర్‌ను సేవ్ చేసుకొండి’

VSP: APEPDCL పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 30, 2026 / 08:07 AM IST

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం: ఎమ్మెల్యే

SKLM: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. ఆదివారం రాత్రి రణస్థలం మండలం సంచాం పంచాయతీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ మేరకు నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో పాల్గొని , పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి గ్రామంలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

March 30, 2026 / 08:05 AM IST

ఆంజనేయ స్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ATP: డీ.హీరేహల్ మండలం హోసగుడ్డం గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరిపై ఆంజనేయ స్వామి వారి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

March 30, 2026 / 08:00 AM IST

మద్యం మత్తులో భార్య, బిడ్డపై కత్తెరతో దాడి

PLD: మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్నబిడ్డ అని కూడా చూడకుండా కత్తెరతో దాడికి తెగబడ్డాడు. మాచర్ల రోప్‌వే కాలనీకి చెందిన గణేశ్ నిత్యం మద్యం తాగి గొడవపడేవాడు. ఆదివారం భార్యతో వాగ్వాదానికి దిగి, అడ్డువచ్చిన కుమారుడు అభిషేక్‌పై కత్తెరతో విచక్షణారహితంగా దాడి చేశాడు. బాలుడి వీపు, చేతిపై తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

March 30, 2026 / 08:00 AM IST

మొక్కజొన్న పొలంలో అగ్నిప్రమాదం

ప్రకాశం: గిద్దలూరు మండలంలోని ఉప్పలపాడు గ్రామ సమీపంలో ఆదివారం మొక్కజొన్న సోమపురిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు. అయితే, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో మొక్కజొన్న రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

March 30, 2026 / 08:00 AM IST

అలర్ట్.. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కోనసీమ: విద్యుత్తు లైన్లకు సమీపంలోని చెట్ల కొమ్మలు, కొబ్బరి ఆకులు తొలగించడం కోసం యానాం లోని మెట్టకూరు విద్యుత్తు సబ్ స్టేషన్ పరిసర కాలనీలు, యూకేవీ నగర్, భీంనగర్, కన కాలపేట, అగ్రహారం, ఫ్రాన్సుతిప్ప, విష్ణాలయంవీధి పరిసరాల్లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ముగ్గళ్ల వీరవెంకట సత్యనారాయణ తెలిపారు.

March 30, 2026 / 08:00 AM IST

నర్సీపట్నంలో గ్యాస్ సిలిండర్లు మోస్తున్న మహిళలు

AKP: నర్సీపట్నంలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ రోజు రోజుకు వినియోగదారులకు చుక్కలు చూపిస్తుంది. ఇంత వరకు నీళ్ల బిందెలు మోసిన మహిళలు నెత్తి మీద గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి నర్సీపట్నం వస్తున్న దృశ్యాలు సోమవారం కనపడ్డాయి. ఉదయమే వస్తే తప్ప గ్యాస్ దొరకదు అన్న ఆత్రుత వారిలో కనబడుతుంది.

March 30, 2026 / 08:00 AM IST