• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గిరిజనులకు ఉచిత మెగా వైద్య శిబిరం

ASR: డుంబ్రిగూడ మండలం కింజేరు గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం, పీపుల్స్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 140 మంది రోగులు వైద్య సేవలు పొందారు. డా ఎం.ఐ. విజయ్ భాస్కర్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

March 5, 2026 / 05:33 PM IST

జనసేన సభ్యత్వ నమోదుపై కీలక సమావేశం

WG: పాలకొల్లులో గురువారం జనసేన 5వ దశ ఉద్యమి సభ్యత్వ నమోదుపై కార్యాచరణ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని పాలకొల్లు, ఆచంట నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

March 5, 2026 / 05:32 PM IST

జిల్లాలోని చెత్త సేకరణపై కమిషనర్ ఆదేశాలు

కర్నూలు: వంద శాతం చెత్త సేకరణను సమర్థంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కార్పొరేషన్ కమిషనర్ పి.విశ్వనాథ్ ఇవాళ కోరారు. శానిటేషన్ ఇన్స్‌స్పెక్టర్, కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఇంటింటి చెత్త సేకరణ, చెత్త వాహనాల జీపీఎస్ ట్రాకింగ్‌పై సమీక్షించారు. నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు కొనసాగుతున్నాయనిన్నారు.

March 5, 2026 / 05:30 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ సీఎం

KDP: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి కుమార్తె కృష్ణ కావ్య, వినీత్ రెడ్డిలను మాజీ సీఎం జగన్ ఆశీర్వదించారు. గురువారం రిసెప్షన్ వేడుకలకు హాజరైన జగన్ పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తల నడుమ రిసెప్షన్ హాలుకు చేరుకొని వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ఆయనకు పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.

March 5, 2026 / 05:29 PM IST

డిప్యూటీ సీఎంను కలిసిన MLA

BPT: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను గురువారం చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రహదారులు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధుల మంజూరుపై ఈ సందర్భంగా వారు చర్చించారు. చీరాల పర్యటనకు రావాలని ఎమ్మెల్యే కోరగా, పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.

March 5, 2026 / 05:28 PM IST

విశాఖకు మంత్రి నారా లోకేష్ రాక

విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం విశాఖ వాల్తేర్ క్లబ్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల వెంకటరమణ సోదరుని కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.

March 5, 2026 / 05:23 PM IST

బండి ఆత్మకూరులో సామాజిక తనిఖీ ప్రజా వేదిక

NDL: బండి ఆత్మకూరు మండలంలో 2024-25లో చేపట్టిన ఉపాధి హామీ పనులపై 19వ విడత సామాజిక తనిఖీ జరిగింది. ఎంపీడీవో గాయత్రి ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ అధికారి పరమేశ్వరుడు, తనిఖీ బృందం పాల్గొన్నారు. మండలంలో రూ.10.15 కోట్ల పనులు చేశారని చెప్పారు. రికవరీ రూపంలో రూ.13,262, పెనాల్టీ రూపంలో రూ.21వేల రికవరీకి ఆదేశించారు.

March 5, 2026 / 05:21 PM IST

ఎమ్మెల్యే ఆఫీసులో ఉచిత మెడికల్ క్యాంప్

ELR: ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు డివిజనులకు చెందిన ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

March 5, 2026 / 05:17 PM IST

కొండ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని వినతి

VSP: జీవీఎంసీ 48వ వార్డు కొండ ప్రాంతపు సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ గంకల కవిత జీవీఎంసీ కమిషనర్‌‌ను కోరారు. గురువారం జీవీఎంసీ కార్యాలయంలో ఆయనను కలిసి వినతి అందజేశారు. కొండ ప్రాంతంలో జై భారత్ నగర్, శ్రీనివాస్ నగర్లో 72A/2, 75A/5, 75A/6 స్తంభాలు, ఇండ్లకు అతి దగ్గరలో ఉన్నాయని, వాటి తీగలు తగిలి గతంలో కొందరు మరణించారని, ఆ స్తంభాలను తొలగించాలన్నారు.

March 5, 2026 / 05:17 PM IST

‘భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి’

SKLM: పలాస మున్సిపాలిటీలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సర్వే నెంబర్ 28లో ఉన్న సుమారు 1.84 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారని 29వ వార్డు కౌన్సిలర్ జోగ మల్లేశ్వరరావు ఆరోపించారు. సమగ్ర విచారణ జరపాలని డిప్యూటీ తహసీల్ధార్‌కు వినతిపత్రం అందజేశారు.

March 5, 2026 / 05:16 PM IST

మంగళగిరి ఎయిమ్స్‌లో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష

GNTR: మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో గురువారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. మౌలిక వసతుల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సూచించారు.

March 5, 2026 / 05:15 PM IST

స్వర్ణాంధ్ర క్యాలండర్ ఆవిష్కరించిన కలెక్టర్

VZM: రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 క్యాలండర్‌ను జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. వాటిని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ పి.గోవిందరాజులు, వివిధ శాఖల అధికారులు అత్యధికంగా పాల్గొన్నారు.

March 5, 2026 / 05:13 PM IST

‘విద్యాశాఖ సమస్యలు పరిష్కరించాలి’

KRNL: కర్నూలు జిల్లాలో విద్యా శాఖలో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని బహుజన సేన సమితి డిమాండ్ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర ఆధ్వర్యంలో డీఈవో సుధాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. పాఠశాల భవనాల మరమ్మతులు, ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, తాగునీరు-మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, హాస్టల్ వసతుల మెరుగుదలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

March 5, 2026 / 05:12 PM IST

అనంతపురంలో పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

ATP: జిల్లాలో గురువారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బయాలజీ, మ్యాథ్స్, జూలజీ సబ్జెక్టులకు జరిగిన ఈ పరీక్షల్లో జనరల్ విభాగంలో 5,277 మంది, ఒకేషనల్ విభాగంలో 2,123 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 383 మంది గైర్హాజరైనట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణ నాయక్ తెలిపారు.

March 5, 2026 / 05:12 PM IST

విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించిన ఎంఈవో

AKP: ఎస్ రాయవరం మండలం ఉప్పరాపల్లి గ్రామంలో మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ కలాం విజ్ఞాన కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. గ్రామ ఎంప్లాయిస్ యూనియన్ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు అవసరమైన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. దీనిని సద్వినియోగం చేసుకొని ప్రయోజకులు కావాలని సూచించారు.

March 5, 2026 / 05:11 PM IST