• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు కమలాపురంలో రెవెన్యూ క్లినిక్

KDP: కమలాపురం మండల MRO కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు శివరాంరెడ్డి తెలిపారు. మండలంలోని గ్రామ ప్రజలు తమ భూ-ఇతర రెవెన్యూ సమస్యలను అర్జీరూపంలో సమర్పించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కడప రెవెన్యూ డివిజన్ అధికారి కూడా హాజరవుతారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

February 22, 2026 / 08:08 AM IST

నంద్యాల జిల్లాలో మాంసం ధరలు

NDL: జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్ ధరలు సాధారణంగా ఉన్నాయి. నంద్యాల వెలుగోడు జూపాడుబంగ్లా గడివేముల తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195 స్కిన్ రూ. 220 స్కిన్ లెస్ రూ. 240-270 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ. 800-950 చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.

February 22, 2026 / 08:08 AM IST

పశువుల కోసం నీళ్ల కుండీలు ఏర్పాటు..!

VZM: రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ పథకంలో బాగంగా మూగజీవులకు దాహార్తి తీర్చేందుకు నీళ్ల కుండీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా కొత్తవలస మండలంలో ఉన్న పలు గ్రామాల్లో శనివారం నీళ్ల కుండీలను స్థానిక ఉపాధి హామీ పనుల కార్యక్రమ అధికారి జనార్ధనరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వేసవికాలంలో పశువులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

February 22, 2026 / 08:05 AM IST

నేడు సాగర సంగ్రామం దీక్ష

VSP: ఉపాధ్యాయుల హక్కుల సాధనకు ఆదివారం విశాఖలో సాగర సంగ్రామ దీక్ష నిర్వహిస్తున్నట్లు పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, ఎస్.టీ.యూ నాయకుడు భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఎస్ రాయవరం ఎంఈఓ కార్యాలయం వద్ద గోడ పత్రికను ఆవిష్కరించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు.

February 22, 2026 / 08:05 AM IST

నేడు సామర్లకోటలో ఉచిత వైద్య శిబిరం

KKD: సామర్లకోట భీమేశ్వర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలు నుంచి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని క్లబ్ అధ్యక్షుడు అమలకంటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ శిబిరంలో పెద్దాపురం భార్గవ్ ఆసుపత్రి వైద్యులచే అన్ని వ్యాధులకు పరీక్షలు చేసి మందులు అందజేస్తారని తెలిపారు. ఈ సేవలను సద్విని యోగం చేసుకోవాలని పట్టణ ప్రజలను కోరారు.

February 22, 2026 / 08:01 AM IST

నేడు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవకాశం

కోనసీమ: ఇవాళ సెలవు దినమైనప్పటికీ, అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని ఎపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎస్. రాజేశ్వరి తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం సెక్షన్ ఆఫీస్ కౌంటర్లు, ఏటీపీ (ATP) కేంద్రాలు కూడా తెరిచి ఉంటాయని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

February 22, 2026 / 08:01 AM IST

శ్రీవారితో వైసీపీ రాజకీయం చేస్తుంది: మంత్రి

కోనసీమ: తిరుమల శ్రీవారిని వైసీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. శనివారం మంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వేంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని మంత్రి ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలను వైసీపీ నాయకులు పదేపదే దెబ్బతీస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

February 22, 2026 / 08:00 AM IST

సోమందేపల్లిలో రంజాన్ నాలుగవ ఉపవాస దీక్ష నిర్వహణ

సత్యసాయి: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సోమందేపల్లిలోని జామియా మజీద్‌లో ఆదివారం నాలుగవ ఉపవాస దీక్షను ముస్లిం మైనారిటీ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే మజీద్‌కు చేరుకున్న ముస్లింలు వజు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పవిత్ర ఖురాన్ పారాయణం, నమాజ్ నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉపవాస దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా ఐక్యతను చాటారు.

February 22, 2026 / 08:00 AM IST

శ్రీశైలం VIP కాటేజీలో చెలరేగిన మంటలు

NDL: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. భక్తుల బస కోసం కేటాయించిన ఓ వీఐపీ కాటేజీలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

February 22, 2026 / 07:51 AM IST

104 మంది సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు

ATP: శెట్టూరు మండలంలో విధులకు గైర్హాజరైన 104 మంది గ్రామ సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో జిలానీబాషా శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలైనా కార్యాలయాలకు రాకపోవడం, సర్వేలపై నిర్లక్ష్యం వహించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఏఎన్ఎంలు, మహిళా పోలీసులకు నోటీసులు ఇచ్చారు.

February 22, 2026 / 07:51 AM IST

నర్సీపట్నంలో ఘనంగా కాళికామాత పండుగ

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆదివారం ఉదయం ఘనంగా శ్రీ కాళికామాత పండుగను నిర్వహించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే పండుగలో పాల్గొనడానికి భక్తులు హాజరయ్యారు. కాళికామాతను డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని గుడివరకు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. మధ్యాహ్నం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 07:48 AM IST

ఎచ్చెర్ల ఎంపీపీగా విజయ్ కుమార్‌కి బాధ్యతలు

SKLM: ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి కొన్ని రోజుల నుంచి అందుబాటులో లేకపోవడంతో మండల పరిషత్తు కార్యక లాపాలు సజావుగా నిర్వహించేందుకు ఉప ఎంపీపీ-2 జరుగుళ్ల విజయ కుమారికి ఎంపీపీ బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

February 22, 2026 / 07:45 AM IST

‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ను విజయవంతం చేయండి’

NLR: ప్రతి కుటుంబ సమగ్ర వివరాలను సేకరించడమే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ముఖ్య ఉద్దేశమని ఎంపీడీవో రంతులయ్య తెలిపారు. సర్వే అనంతరం ప్రతి కుటుంబానికి ఒక యూనిట్ ఫ్యామిలీ ఐడిని కేటాయించనున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ సర్వేలో ప్రజలు భాగస్వామ్యమై విజయవంతం చేయాలని ఆయన కోరారు. సర్వే కోసం వచ్చిన సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు.

February 22, 2026 / 07:45 AM IST

గెలిస్తే రూ. 35 వేల బహుమతి

KDP: VN పల్లె(M) తలపనూరు గ్రామంలోని గంగమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 26న బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నాగిరెడ్డి శనివారం తెలిపారు. బహుమతులు వరుసగా రూ. 35వేలు, రూ. 30వేలు, రూ. 25 వేలు,రూ. 20 వేలు, రూ.15వేలు ఇలా 12 బహుమతులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఉదయం 7 గంటలకే ఈ పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు.

February 22, 2026 / 07:44 AM IST

‘చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి’

VZM: విజయనగరం మహారాజా అయోధ్య మైదానంలో, ‘మై భారత్’ జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లు, వాలీబాల్ కిట్లను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.

February 22, 2026 / 07:41 AM IST