PPM: కొమరాడ పోలీస్ స్టేషన్‌ను పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాలను, బ్లాక్ స్పాట్, కోనేరు చెక్ పోస్ట్‌ను తనిఖీలు చేశారు. ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఆనంతరం పదవ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీచేసి, విద్యార్థులు అందుతున్న సౌకర్యాలు క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రకాశం: జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, మండల నాయకుడు రాంబట్లు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు జనార్దన్ రెడ్డి, స్వామి, కనిగిరి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ఉగ్రనరసింహారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొననున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
KDP: మండల పరిధి మాధవరం-1లోని హెల్త్ కేర్ క్లినిక్‌లో ఆదివారం కడపకు చెందిన శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వ హిస్తున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. బీపీ, షుగర్, కిడ్నీ, గుండె వ్యాధులకు పరీక్షలు, ఈసీజీ ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్‌కు మియాపూర్ (హైదరాబాద్)కు చెందిన మాధవి రూ. 1,00,116 విరాళం అందించారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి మూషిక మండలంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
TPT: సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 30న తిరుపతికి ఒకరోజు పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో, నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమాలను రద్దు చేసినట్లు కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
W.G: గోదావరి పుష్కరాలకు నరసాపురంలో సుమారు రూ.240 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు మున్సిపల్ ఆర్డీ సీహెచ్.నాగ నరసింహరావు తెలిపారు. శనివారం నరసాపురం గోదావరి ఏటిగట్టును ఆయన పరిశీలించారు. ఈ ప్రతిపాదనలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించామన్నారు. అనుమతి రాగానే టెండర్లు పిలిచి పనులు చేపడతామని ఆయన తెలిపారు.
NLR: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈనెల 29, 30వ తేదీల్లో నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి మనోహర్ 29వ తేదీ రాత్రి 10 గంటలకు నెల్లూరుకు చేరుకొని బస చేస్తారు. అనంతరం 30వ తేదీన కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తారు. తదుపరి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షలో పాల్గొంటారని పలువురు అధికారులు తెలిపారు.
NDL: దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి డా. యం.హరి జవహర్ లాల్ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశీర్వచనాలు అందజేసి, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలు, చిత్రపటంతో సత్కరించారు.
NTR: కంచికచర్ల పట్టణం పరిధిలోని మిక్ కాలేజీ సమీపంలో ఆదివారం వేకువజామున అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లారీ.. వరంగల్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కి ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ నియంత్రించారు.
KDP: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే ఆర్.మాధవి రెడ్డి, ఆర్.శ్రీనివాసులు రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 9:30 గంటలకు ఎన్టీఆర్ కూడలిలో జెండా ఆవిష్కరణ, 10:00 గంటలకు కళాక్షేత్రం వద్ద చాయ్ రాస్తా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు బాణాసంచా పేల్చరాదని అధికారులు సూచించారు. పార్టీ శ్రేణులు భారీగా హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యవర్గం పిలుపునిచ్చింది.
అన్నమయ్య: జిల్లాలో 2028 నాటికి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సుండుపల్లెను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. వీరబల్లి, కె.వి.పల్లె, యర్రావారిపాలెం మండలాలతో కలిపి సుండుపల్లె కేంద్రంగా రూపొందే అవకాశం ఉందని సమాచారం. దీంతో పలు రాజకీయ కుటుంబాలు, కొత్త నాయకులు రంగంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంఎన్.చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో కొణిదల నాగబాబు సమక్షంలో పార్టీ కండువా ధరించారు. ఆయన చేరికతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చేరికతో జనసేన పార్టీ కార్యకలాపాలు నియోజకవర్గంలో మరింత వేగవంత కానున్నాయి.
KRNL: నైబర్ హుడ్ వర్క్ స్పేస్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సిరి శనివారం తెలిపారు. ‘ఏపీ నైబర్ హుడ్ వర్క్ స్పేస్ పాలసీ 2025-30’లో భాగంగా జిల్లాలో పారి శ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్ సమీపంలో కార్యాలయ వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆమె చెప్పారు. https://investandhra.ap.gov.in నమోదు చేసుకోవాలని సూచించారు.
E.G: నిడదవోలు సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం కాల్దరిలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాల్దరిలో స్వర్ణ గ్రామ సచివాలయ భవనాన్ని, చిల్ట్రన్స్ పార్క్‌ను, సీసీ రోడ్లను, డ్రైన్లను, మినీ గోకులం షెడ్డును ప్రారంభించారు.
NLR: ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు వింజమూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. శనివారం సీఎం పర్యటనకు సంబంధించి వింజమూరు గెస్ట్ హౌస్ నిర్వహణ, ప్రోటోకాల్ బాధ్యతలను నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్‌కు కలెక్టర్ అప్పగించారు.