• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బీటీ రోడ్ నిర్మాణం పూర్తి.. గ్రామస్తులు హర్షం వ్యక్తం

SS: సోమందేపల్లి మండలం రేణుకానగర్ వద్ద హిందూపురం మెయిన్ రోడ్‌కు కలుపుతూ రూ.45 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్ పనులు పూర్తయ్యాయి. దీంతో గ్రామస్థుల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం టీడీపీ నాయకులు రోడ్ పనులను పరిశీలించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ వెంకటేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

April 1, 2026 / 05:35 PM IST

లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని IFTU ధర్నా

ATP: గుంతకల్లలోని పొట్టి శ్రీరాములు సర్కిల్లో IFTU ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని నాయకులు రఘునాథ్ రెడ్డి, రామదాసు డిమాండ్ చేశారు. 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ,కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

April 1, 2026 / 05:33 PM IST

గుడివాడలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

GNTR: తెనాలి మండలంలోని గుడివాడ గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గ్రామంలో చేపట్టిన రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాల పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

April 1, 2026 / 05:30 PM IST

సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

KDP: ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా టీటీడీ జిల్లా అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించారు. అలాగే తలంబ్రాలు ప్యాకెట్లు, శ్రీవారి ప్రసాదం సిద్ధం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

April 1, 2026 / 05:29 PM IST

గుర్తు తెలియని వృద్ధుడు మృతి

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని బండ్లపెంట దర్గా సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.మృతుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.

April 1, 2026 / 05:26 PM IST

‘అర్హులకు సంక్షేమాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయం’

E.G: అర్హులందరికీ సంక్షేమాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బుధవారం కడియం మండలం వీరవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్తిగా మంచాన పడిన అర్హురాలికి 15 వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేశారు.

April 1, 2026 / 05:26 PM IST

మెట్లపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి

SKLM: పాతపట్నంలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చింతాడ పూజిత (12) అనే విద్యార్థిని మృతి చెందింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భోజనాలకు వెళుతుండగా మెట్ల పైనుంచి జారి కిందపడింది. తీవ్రంగా గాయపడిన బాలికను పాఠశాల సిబ్బంది సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.

April 1, 2026 / 05:26 PM IST

రోడ్డు భద్రతకు ఆధునిక పరికరాల పంపిణీ

KRNL: కర్నూలు జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణతో పాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతను బలోపేతం చేసే దిశగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గట్టి చర్యలు చేపట్టామని తెలిపారు. బుధవారం కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కిట్లు, హైవే పెట్రోలింగ్ మొబైల్ పోలీసులకు ఆధునిక పరికరాలు పంపిణి చేశారు.

April 1, 2026 / 05:23 PM IST

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం. విజయ సునీతను బుధవారం కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనిగిరి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి పనులపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

April 1, 2026 / 05:21 PM IST

‘శబల ఆహారం-ఆరోగ్యానికి మార్గం’

VSP: సింహాచలం గోశాలలో సేవ్ సంస్థ ఆధ్వర్యంలో బుధ‌వారం నిర్వహించిన శబల భోజనాల పండుగలో విజయనగరం ఎమ్మెల్యే అతిది గజపతి రాజు పాల్గొని సహజ ఆహారం, పర్యావరణ హిత జీవన విధానంపై ప్రాధాన్యతను వివరించారు. అలాగే, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తదితరులు పాల్గొని ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు.

April 1, 2026 / 05:20 PM IST

లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

AKP: లబ్ధిదారులకు సక్రమంగా పింఛన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం అనకాపల్లి పట్టణం 84వ వార్డు పెరుగు బజారు ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీ విధానంపై ఆరా తీశారు. జిల్లాలో 2,53,336 మందికి సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు.

April 1, 2026 / 05:19 PM IST

డిగ్రీ కళాశాల ఏర్పాటుపై మంత్రి సమీక్ష

SKLM: కోటబొమ్మాళి మండలానికి డిగ్రీ కళాశాల మంజూరైన నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం కోటబొమ్మాళిలోని అధికారులతో సమావేశం నిర్వహించారు. కళాశాల స్థాపనకు సంబంధించిన ఏర్పాట్లు, భవన నిర్మాణం, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నియామకం వంటి అంశాలపై చర్చించారు. ఇందులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, RDO పాల్గొన్నారు.

April 1, 2026 / 05:16 PM IST

వార్షికోత్సవ వేడుకలకు పెద్దిరెడ్డికి ఆహ్వానం

CTR: సదుం మండలం పాపిరెడ్డిగారి పల్లి ఎల్లమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2న గణపతి పూజ, హోమం, కలసారాధన, 3న ప్రధాన హోమాలు, మహాభిషేకం, శాంతి కుంబాభిషేకం, అమ్మవారి ఊరేగింపు అన్నదానం, 4న అమ్మవారి చరిత్ర పారాయణం ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. ఈ పూజలకు హాజరుకావాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని ఆహ్వానించారు.

April 1, 2026 / 05:14 PM IST

లేబర్ కోడ్స్ అమలుకు వ్యతిరేకంగా నిరసన

SKLM: లేబర్ కోడ్స్ అమలుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ‘బ్లాక్ డే’లో భాగంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. కార్పొరేట్ ప్రయోజనాల కోసం తెచ్చిన ఈ కోడ్స్ కార్మికులకు ఉరితాళ్లు వంటివని, వీటిని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలతో కార్మికులు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించారు.

April 1, 2026 / 05:14 PM IST

రెవెన్యూ సేవల్లో అలసత్వం వద్దు: ఆర్డీవో

ASR: రెవెన్యూ సేవల్లో అలసత్వం వద్దని, గడువులోగా ప్రజలకు సేవలు అందించాలని ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు సూచించారు. డుంబ్రిగూడలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని, ఈ-కేవైసీ ద్వారా సవరణలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులు, పీజీఆర్ఎస్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

April 1, 2026 / 05:13 PM IST