• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఈనెల 31న ఖాళీ స్థలాలకు వేలంపాట

CTR: పుంగనూరులో ఈనెల 31న బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ బస్టాండ్, పుంగమ్మ చెరువు ట్యాంక్ వద్ద గల పబ్లిక్ యూరీనల్స్, మున్సిపల్ ప్రైవేట్ బస్టాండ్ వద్ద గల ఖాళీ స్థలాలు, ఖాళీగా ఉన్న జనరల్ షాపు రూములు, ఖాళీగా ఉన్న ఐడీఎస్‌ఎంటీ షాపు రూములకు వేలం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

March 29, 2026 / 11:34 AM IST

చనుబండలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు

కృష్ణా: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశ రాజకీయ చరిత్రలో మరువలేని రోజు అని తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం చనుబండ సెంటర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన రోజున, కార్మికుల కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన చరిత్రను ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు.

March 29, 2026 / 11:30 AM IST

రేపు తొండూరు మండల సర్వ సభ్య సమావేశం

KDP: తొండూరు మండల సర్వ సభ్య సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు ఎంపీపీ నారాయణమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విష్ణు ప్రసాద్ రెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీడీవో ఆఫీస్ సభా భవనంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో 16 అంశాలపై చర్చిస్తామని ఎంపీడీవో అన్నారు. అయా శాఖల అధికారులు ప్రగతి నివేదికలు తీసుకుని హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.

March 29, 2026 / 11:28 AM IST

ప్రకృతి వ్యవసాయంతోనే లాభదాయక సాగు: కలెక్టర్

ATP: రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. కళ్యాణదుర్గం మండలం భట్టువానిపల్లిలో ‘హాఫ్ మూన్’ మోడల్ అమలును ఆయన పరిశీలించారు. వర్షపు నీటిని నిల్వ చేస్తూ నేల కోతను నివారించే ఈ విధానం సుస్థిర వ్యవసాయానికి పునాది అని ఆయన పేర్కొన్నారు.

March 29, 2026 / 11:25 AM IST

భగీరథపురంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

SKLM: ఎచ్చెర్ల మండలం భగీరథపురం గ్రామ పంచాయతీ టీడీపీ 44వ జెండా ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. టీడీపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, నారా చంద్రబాబునాయుడు బడుగు బలహీన వర్గాలకు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని సాదు మల్లేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తంగి సన్యాసిరావు, గురువు వెంకటరమణ, గొలివి అనంత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

March 29, 2026 / 11:20 AM IST

గండేపల్లిలో మట్ల ఆదివారం వేడుకలు

NTR: గండేపల్లిలో మట్ల ఆదివారం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సంఘ కాపరి కొండ స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో సంఘ పెద్దలు, స్త్రీల మైత్రి సభ్యులు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు. విశ్వాసులు ఈత మట్టలతో ఊరేగింపు నిర్వహించి, “హోసన్నా” జయధ్వానాలతో యేసు నామాన్ని స్మరించారు. క్రీస్తు బోధనలను భక్తులకు వివరించారు.

March 29, 2026 / 11:20 AM IST

టీడీపీ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను: ఎంపీ

VZM: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా MP కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ తన స్వగ్రామం V.N. పురంలో పార్టీ నాయకులతో కలిసి పార్టీ జెండాని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావ దశ నుంచి ఘనమైన చరిత్ర కలిగిన పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ MPగా నన్ను ఢిల్లీకి పంపించిన టీడీపీ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

March 29, 2026 / 11:20 AM IST

నాటు కోళ్ల పేరుతో ఘరానా మోసం

ప్రకాశం: మార్కాపురంలో నాటు కోళ్ల పేరుతో చికెన్ షాప్ యజమానులు మోసానికి పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు నాటు కోళ్లను విక్రయించకుండా వాటిని పోలీవున్న ఇతర రాష్ట్రాల కోళ్లను అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై సమ్మతి అధికారులు దాడులు నిర్వహించి, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

March 29, 2026 / 11:20 AM IST

ఆర్డీటీ సేవా యజ్ఞానికి కూటమి ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే

అనంతపురం ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో సంస్థ నిర్వాహకులు మాంఛో ఫెర్రర్‌ను కనగానపల్లి MLA దగ్గుపాటి ప్రసాద్ ఆదివారం ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా మాంఛో ఫెర్రర్‌ను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆర్డీటీకి విదేశీ నిధుల రెన్యూవల్ (FCRA) లభించడంలో మంత్రి నారా లోకేష్ పోషించిన పాత్ర కీలకమని, ఇందుకు జిల్లా ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.

March 29, 2026 / 11:18 AM IST

టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ధర్మరాజు

ELR: తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచ నలుమూలన చాటి చెప్పిన ఘనత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి దక్కిందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. ఆదివారం ఉంగుటూరులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సింధు, చందు, అయ్యప్ప, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

March 29, 2026 / 11:18 AM IST

కౌతాళంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

KRNL: కౌతాళం మండల కేంద్రంలో ఉరుకుంద ఈరన్న మాజీ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ చెన్న బసప్ప ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు పార్టీ చరిత్ర, ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాత్రను వివరించారు. సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలు టీడీపీ ప్రత్యేకతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 29, 2026 / 11:16 AM IST

ఈనెల 30, 31న తిరుమలలో పర్యటించనున్న గవర్నర్

TPT: రాష్ట్ర గవర్నర్ ఈనెల 30, 31 తేదీలలో తిరుపతి పర్యటనకు రానున్నారని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

March 29, 2026 / 11:12 AM IST

ఏలూరులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఏలూరు టీడీపీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి, ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పార్టీ స్థాపించి పేదలకు సంక్షేమ ఫలాలు అందించిన గొప్ప పార్టీ టీడీపీ అని కొనియాడారు.

March 29, 2026 / 11:10 AM IST

చాగలమర్రిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నంద్యాల: చాగలమర్రి పట్టణంలో ఆదివారం ఉదయం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ భాష ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ సెంటర్ కూడలిలో సీనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించి టీడీపీ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.

March 29, 2026 / 11:10 AM IST

జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్ష

W.G: జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల రామనాయుడు, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని సీఎం స్పష్టం చేశారు.

March 29, 2026 / 11:08 AM IST