ATP: మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో ఉరవకొండ నియోజకవర్గంలోని 74 మంది లబ్ధిదారులకు రూ.43.37 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను టీడీపీ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు పంపిణీ చేశారు. పెద్ద కౌకుంట్ల గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు.
అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన & క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం రాయచోటి పర్యటన చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2:00 గంటలకు యండపల్లి కాలభైరవ స్వామి దేవస్థానం కార్యక్రమంలో, సాయంత్రం 4:00 గంటలకు మాధవరం మూలపల్లిలో ముడి రఘుపతి నాయుడు కుటుంబాన్ని పరామర్శించగా, సాయంత్రం 5:00 గంటలకు చెన్నముక్కపల్లి మస్జిద్-ఏ-సఫురా వద్ద ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామంలో శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జనసేన పార్టీ సిద్ధాంతాలను స్మరించుకుంటూ, అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
NDL: కూటమి ప్రభుత్వం వల్లనే రైతు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ అన్నారు. మండల కేంద్రం రుద్రవరం మండల పరిషత్ సమావేశ భవనంలో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని వివరించారు.
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం ఉప్పలపాడు గ్రామంలో ఇటీవల మరణించిన దుగ్గిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులను ఇవాళ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
CTR: బీసీ నేత షణ్ముగం కుమార్తె శ్రీదుర్గ రోడ్డు ప్రమాదానికి గురై చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయింది. దీనిపై వైసీపీ ఇంఛార్జ్ విజయానందరెడ్డి రాజకీయం చేయడం తగదని ఆయన ఖండించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల సాయం చేయలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యే కుటుంబం తమ కుటుంబానికి అండగా నిలిచిందన్నారు. వైసీపీనే తమకు సహకరించలేదని ఆరోపించారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని జొన్నవాడ సెంటర్ వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ చప్పిడి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. పిల్లల చేత కేక్ కట్ చేయించారు. మాట్లాడుతూ.. జనసేన పార్టీ ప్రజల పక్షాన నిరంతరం నిలబడుతుందని తెలిపారు.
KRNL: గోనెగండ్ల మండలం అల్వాల గ్రామంలో శనివారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో, సీఐ చంద్రబాబు నేతృత్వంలో సిబ్బంది పలు ఇళ్లను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
VSP: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు.
NDL: నంద్యాల జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ శనివారం తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించబడతాయి. జిల్లాలోని 130 కేంద్రాల్లో 25,035 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు.
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) నూతన వైస్ ఛాన్సలర్‌గా జ్యోతి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుదలపై ఆయన దృష్టి సారించనున్నారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
VZM: వినియోగదారులు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు శ్రీదేవి అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం విజయనగరం కలెక్టరేట్లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రతి వినియోగదారుడికి రక్షణ, సమాచారం, ఎంపిక, ఫిర్యాదు చేసే హక్కులు ఉన్నాయన్నారు.
గుంటూరులో 3 కేజీల గంజాయిని అమ్మే క్రమంలో నిందితులను అరెస్ట్ చేసినట్లు తూర్పు DSP షేక్ అజీజ్ తెలిపారు. శుక్రవారం ఏటుకూరు బైపాస్ రోడ్డు వద్ద చిన్న చిన్న పొట్లాలు చేసి నిందితులు గంజాయి అలవాటు ఉన్నవారికి అమ్ముతూ వ్యాపారం చేసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. రెండు వేరు వేరు ప్రదేశాలలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు.
ప్రకాశం: మార్కాపురం పట్టణానికి చెందిన LAW విద్యార్థి ఎనిబేర బాబీ పై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని MRPS ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నేలపాటి రాజు మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం మార్కాపురం డీఎస్పీ, రూరల్ ఎస్సైను కలిసి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో పందిటి కాశిరావు, వినయ్, దేవ ప్రభాకర్ పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ బాలాజీ చర్యలు తీసుకున్నారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శించిన డోకిపర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-2) రజియా సుల్తానాను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జనాభా లెక్కల శిక్షణకు హాజరు కాకపోవడంతో వడ్లమన్నాడు సచివాలయ డీఏ కే.సురేంద్రకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.