CTR: స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా చిత్తూరు నగరపాలక పరిధిలో బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలలు, హాస్టళ్లు, గృహాల వద్ద తడి-పొడి చెత్తను వేర్వేరుగా వేయడం, హజార్డస్ వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించడం గురించి వివరించారు. మెరుగైన పారిశుద్ధ్యానికి ప్రజల సహకారం అవసరమని తెలిపారు.
ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీరామ సుశీల తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినిలు 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 7, 8, 9, 10వ తరగతుల్లో మిగిలిన సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
SKLM: కోటబొమ్మాళి మండలం మంచాలపేట గ్రామానికి చెందిన మంచాల వెంకటరమణపై భార్య మంచాల సునీత, తన సోదరుడితో కలిసి బుధవారం దాడి చేసింది. తనను ఒక గదిలో బంధించి భార్య బావమరిది గొల్లంగి జగదీష్‌లు గాయపరిచారని బాధితుడు వెంకటరమణ తెలిపారు. గాయపడిన తనను కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.
NTR: విస్సన్నపేట మండలం తాతకుంట్ల తండాతో పాటు పలుతండాల్లో టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుడివాడ వారిచే ఉచిత వైద్య శిబిరం బుధవారం ఏర్పాటు చేశారు. ఎముకలు గ్యాస్ట్రో, సాధారణ వ్యాధులకు నిపుణులైన వైద్యులచే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.
VSP: సైబర్ మోసాలకు గురైన 1,240 మంది బాధితులకు రూ.22.47 కోట్లను రీఫండ్ చేసినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. చట్టపరమైన ప్రక్రియ ద్వారా హోల్డ్, ఫ్రీజ్ చేసిన మొత్తాలను బ్యాంకులు, సంబంధిత సంస్థలతో సమన్వయం చేసి బాధితులకు తిరిగి అందించినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సైబర్ మోసాల బాధితులకు నష్టపరిహారం అందించిన ఘనత మాదేనన్నారు.
VZM: నాటు తుపాకులు కలిగి ఉండడం, లైసెన్సు లేకుండా వినియోగించడం చట్టరీత్యా నేరమని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ ఆయుధాలు ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని, ఎవరి వద్దైనా నాటు తుపాకులు ఉంటే స్వచ్ఛందంగా సమీప పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని సూచించారు.
KRNL: ఆదోని(మం) నాగన్నతహళ్లిలో ఇవాళ నిర్వహించిన పెద్దమ్మ అవ్వ దేవర కార్యక్రమాల్లో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ హాజరయ్యారు. అనంతరం ఆమె దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం, ర్యాలి గ్రామంలో వేంచేసియున్న శ్రీ జగన్మోహిని కేశవ & గోపాల స్వామి వారి దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. 5 నెలల 3 రోజులకు గాను ప్రధాన హుండీల ద్వారా రూ. 9,52,522, అన్నదాన హుండీల ద్వారా రూ.4,45,990 మొత్తంగా రూ.13,98,512 ఆదాయం వచ్చిందని ఈవో నరేంద్ర కుమార్ తెలిపారు.
సత్యసాయి: కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవంలో జరిగిన ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ బుధవారం భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. కాలు పూర్తిగా దెబ్బతిన్న వ్యక్తికి రూ.5 లక్షలు, మిగిలిన ఐదుగురికి రూ.లక్ష చొప్పున సాయం అందజేస్తామని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి ఆలయంలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ATP: గుత్తి మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో గుత్తి కోట ఉత్సవాలపై మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెప్మా పీడీ విశ్వ జ్యోతి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 14, 15 తేదీల్లో జరిగే కోట ఉత్సవాలలో మహిళా సంఘాల సభ్యులను హాజరయ్యేలా ఆర్పీలకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కోట ఉత్సవాలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
BPT: సంతమాగులూరులోని చవిటిపాలెం, మిన్నెకల్లు గ్రామాల్లో గురువారం విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్థన్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9:45 గంటలకు చవిటిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 10:30 గంటలకు మిన్నెకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.
PLD: మాచవరం మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ సంవత్సరం ఈ-పంట నమోదు చేసుకున్న జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి రామమ్మ బుధవారం తెలిపారు. జాబితాలో పొరపాట్లుంటే సరిదిద్దుకోవడానికి ఈనెల 14వ తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో తిరిగి నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆమె పేర్కొన్నారు.
VSP: వాల్తేరు రైల్వే డివిజన్ కొత్త చరిత్ర సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి 24 రోజులు ఉండగానే 78.464 మిలియన్ టన్నుల లోడింగ్ లక్ష్యాన్ని అధిగమించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 16.5 శాతం పెరుగుదల. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన టీమ్ వాల్తేరుకు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా అభినందనలు తెలిపారు.
VSP: రంజాన్ పర్వదినం సందర్భంగా నగరంలోని ముస్లిం జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు గంట్ల శ్రీనుబాబు రంజాన్ తోఫా అందజేశారు. బుధవారం అక్కయ్యపాలెంలో జర్నలిస్టులకు రూ.20 వేల నగదు, ప్రత్యేక బహుమతులు పంపిణీ చేశారు.
VZM: జిల్లా APNGGO ఆధ్వర్యంలో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య వ్యవస్థాపకులు ఆమనగంటి శ్రీరాములు 105వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎ. సురేష్, కార్యదర్శి టి. శ్రీధర్ బాబు ఆయన జీవిత చరిత్ర, ఉద్యమ సేవలను సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వై. ఆనంద్ కుమార్, కార్యదర్శి పి. రామకృష్ణ పాల్గొన్నారు.