చంద్రబాబుని టార్గెట్ చేస్తూ…సీఎం జగన్… కుప్పంలో బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. కుప్పంలో చంద్రబాబు ని ఓడించడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు. జగన్ అభివృద్ది కోసం కోట్ల రూపాయలకు కూడా ఖర్చు చేస్తున్నారు. ఆ ఒక్క నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి మరీ ఆయన చంద్రబాబుని ఓడించాలని చూస్తున్నారు.
తాజాగా వైఎస్సార్ చేయూత స్కీమ్ అమలు సందర్భంగా కుప్పంలో జగన్ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు భారీస్థాయిలో జనం హాజరయ్యారు. అయితే ఈ సభకు హాజరైన వాళ్లలో చాలామంది ఇతర ప్రాంతాలకు చెందిన వారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కుప్పం ప్రజలు జగన్ సభకు హాజరు కాకుండా ఇంటికే పరిమితం అయ్యారని సమాచారం అందుతోంది. కుప్పంలో వైసీపీ వాస్తవ పరిస్థితి ఇదీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
కుప్పంలో 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ గెలవడం కష్టమేనని తెలుస్తోంది. జగన్ సభను కూడా అక్కడి ప్రజలు పట్టించుకోవడం లేదంటే అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. జగన్ కుప్పంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇతర నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జగన్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరేలా నిధులను విడుదల చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించలేకపోవడం వల్ల పల్లెల్లో నివశించే ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ గుర్తుంచుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సుప్రీం కోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కామ్ కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌పై నేడు విచారణ జరగ్గా సుప్రీం విచారణను డిసెంబర్ 8వ తేదికి వాయిదా వేసింది. బాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి సుప్రీం అనుమతులు ఇచ్చింది.