MLG: వెంకటాపురం మండలంలోని గొల్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ములక ఐలయ్య రెండు ఎకరాల భూమిలో కూరగాయల విభిన్న పంటలు సాగించి మంచి లాభం పొందుతున్నారు. టమాట, పాలకూర, తీర దోస, గోంగూర పంటల ద్వారా ఆర్థికంగా స్థిరపడుతున్నట్లు రైతు తెలిపారు. గతంలో వాణిజ్య పంటలు సాగుచేసి ఆర్థికంగా నష్టపోయిందని తెలిపారు. వ్యవసాయ అధికారుల సలహా మేరకు కూరగాయలు సాగు చేసి లాభం పొందుతున్నట్లు తెలిపరు