ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విషయంలో మొదలైన రచ్చ…ఇంకా తగ్గలేదు. అయితే… ఈ విషయంలో టీడీపీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని వైసీపీ నేతలు ఎవరూ పట్టించుకోలేదు కానీ… ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ పై మాత్రం స్పందిస్తూ… రాజకీయం చేయడం గమనార్హం.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం డైరెక్టుగా జూనియర్ ని టార్గెట్ చేశారు. పేరుమార్పుపై జూనియర్ ఒక ట్వీట్ చేశారు. నిజానికి ఆ ట్వీట్ ఎందుకు చేశారో కనీసం జూనియర్ కైనా క్లారిటీ ఉందో లేదో. ఆ ట్వీట్ గురించే అనిల్ మాట్లాడుతూ ఎన్టీయార్ నుండి ముఖ్యమంత్రి పదవిని, పార్టీని లాగేసుకున్నపుడు ఈ పౌరుషం ఏమైందని జూనియర్ ను నిలదీశారు. అప్పట్లో చిన్నపిల్లలని అనుకున్నా మరి పెద్దోళ్ళయిన తర్వాత అయినా పార్టీని చంద్రబాబు దగ్గరనుండి లాగేసుకోవాలి కదా ? అంటూ ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో సైతం తారక్ ను కొందరు టార్గెట్ చేసి విమర్శలు చేస్తుండటం గమనార్హం. సేఫ్ గేమ్ ఆడుతున్నారని… సేఫ్ గా ఎవరికీ నొప్పి కలగకుండా ట్వీట్ చేశారని విమర్శిస్తున్నారు. ధైర్యంగా జగన్ చేసింది తప్పు అని ఎందుకు ట్వీట్ చేయలేదని కొందరు ప్రశ్నిస్తుండటం గమనార్హం.