VSP: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌లో 20 వినతులు స్వీకరించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకరరావు తెలిపారు. ప్రధాన కార్యాలయంలో సీపీలతో కలిసి నిర్వహించిన ఫోరమ్‌లో భీమిలి–1, మధురవాడ–2, ఈస్ట్–2, సౌత్–3, నార్త్–6, పెందుర్తి–1, అగనంపూడి–1, గాజువాక–4 వినతులు వచ్చాయి. ప్రతి శుక్రవారం ఈ ఫోరమ్ నిర్వహించి ఫిర్యాదులను వేగంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.