ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు విషయం ఏపీలో ఎంత వివాదంగా మారిన సంగతి తెలిసిందే. హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష పార్టీల నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు.
కాగా.. తాజాగా ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదకగా స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని అన్నారు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరు పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదని.. అలాగే ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్నవారి జ్ఞాపకాలు చెరిపివేయలేరని అన్నారు.
జనతా గ్యారేజ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. ఈసారి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్, కొరటాల శివ. ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న దేవర టీజర్‌ను త్వరలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.